కాల్బాయ్స్తో ఎంపీ రాసలీలలు ! | Indian Origin UK Lawmaker Steps Down Over Sex Scandal | Sakshi
Sakshi News home page

కాల్బాయ్స్తో ఎంపీ రాసలీలలు !

Published Sun, Sep 4 2016 6:47 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

కాల్బాయ్స్తో ఎంపీ రాసలీలలు ! - Sakshi

కాల్బాయ్స్తో ఎంపీ రాసలీలలు !

లండన్: భారత సంతతికి చెందిన ఓ బ్రిటన్ చట్టసభ సభ్యుడు చిక్కుల్లో పడ్డాడు. అతడిపై సెక్స్ స్కాండల్ ఆరోపణల నేపథ్యంలో తన బాధ్యతలకు తాత్కాలికంగా దూరం జరిగారు. గత చాలా కాలంగా బ్రిటన్లో చట్టసభలో ఎంపీగా కొనసాగుతున్న కెయిత్ వాజ్(59) అనే వ్యక్తి లైంగిక వాంచలు తీర్చే మేల్ సెక్స్ వర్కర్లకు డబ్బులు చెల్లించారని ఓ పత్రికలో కథనం వెలువడటంతో అందుకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి పక్కకు జరిగారు. అంతేకాదు, బ్రిటన్లో నిషేధించిన ఉత్ప్రేరకాలు కూడా ఆయన కొనుగోలుచేసినట్లు సదరు కథనంలో ఆ పత్రిక పేర్కొంది.

బ్రిటన్లో లైసిస్టర్ ప్రాంతం నుంచి 1987 నుంచి ఎంపీగా కెయిత్ వాజ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నెలలో లండన్లోని తన ఫ్లాట్కు ఇద్దరు కాల్ బాయ్స్ను పిలిపించుకున్నాడని 'సండే మిర్రర్' ప్రచురించింది. దీంతో త్వరలోనే తాను హౌజ్ ఆఫ్ కామన్స్ హోమ్ అఫైర్స్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. ఇందులో ఆయన పదేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ సందర్భంగా అతడు ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు. 'నా చర్యలతో తీవ్రంగా గాయపడిన, ఇబ్బందిపడిన నా భార్య, పిల్లలకు, మొత్తం కుటుంబానికి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో క్షమాపణలు చెబుతున్నాను.

మంగళవారం విచారణ కమిటీ ముందు హాజరై పూర్తి వివరణ ఇస్తాను' అని కెయిత్ చెప్పాడు. మొత్తం రెండుసార్లు కెయిత్ ఈస్ట్రన్ యూరోపియన్కు చెందిన ఆ ఇద్దరితో 90 నిమిషాలపాటు సమావేశం అయ్యాడట. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటకొచ్చిందట. ఆ రోజు ఆయన వారికి పంపించిన ఎస్సెమ్మెస్‌లో కొన్ని పరిశీలిస్తే.. 'రాత్రి 11 అయింది. నైస్.. కానీ బాగా ఆలస్యం. నాకు మంచి విడుపు కావాలి ప్లీజ్' అంటూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఆయన ఇంకా అధికారికంగా ఎంపీ బాధ్యతల నుంచి తప్పుకోలేదు. విచారణ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement