నేను ప్రెగ్నెంట్ కాదు! | Kareena Kapoor is not playing a pregnant woman in Veere Di Wedding | Sakshi
Sakshi News home page

నేను ప్రెగ్నెంట్ కాదు!

Published Tue, Sep 20 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

నేను ప్రెగ్నెంట్ కాదు!

నేను ప్రెగ్నెంట్ కాదు!

 ‘అవును.. నేను ప్రెగ్నెంట్’ అని ఆ మధ్య కరీనా కపూర్ బాహాటంగా ప్రకటించారు. బేబీ బంప్‌తో బయట కొస్తున్నారు కూడా. మొన్నా మధ్య ఓ ఫ్యాషన్ షోలో బేబీ బంప్‌తో ర్యాంప్ వాక్ చేసిన తర్వాత ఉద్వేగభరి తంగా మాట్లాడి, అందర్నీ ఆకట్టుకున్నారు. ఇప్పుడిలా నేను ప్రెగ్నెంట్ కాదని స్టేట్మెంట్ ఇవ్వడమేమిటి అను కుంటున్నారా! కరీనా చెబుతున్నది హిందీ సినిమా ‘వీరె ది వెడ్డింగ్’ గురించి.

 ఇందులో కరీనా ప్రెగ్నెంట్‌గా నటించనున్నారని వార్తలు వినిపించాయి. అటువంటిది ఏమీ లేదు, నేనా సినిమాలో ప్రెగ్నెంట్ కాదని కరీనా స్పష్టం చేశారు. అసలు విషయం అదన్న మాట. ‘‘ఈ చిత్రంలో నాకు సిక్స్ ప్యాక్ లేదు. కానీ, సినిమాలో త్రీ ప్యాక్ యాబ్స్‌తో కనిపిస్తాను’’ అని నవ్వేశారు కరీనా. నలుగురమ్మాయిల కథతో రూపొందనున్న ఈ సినిమాలో కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిఖా స్నేహితులుగా నటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement