
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన విశ్వరూపం-2 వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలె ఆటంకాలన్నీ తొలగిపోవటటంతో ఈ చిత్రాన్ని ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తమిళనాడు దిగ్గజనేత కరుణానిధి మరణంతో చిత్రాన్ని వాయిదా వేయాలని కమల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కరుణానిధి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన కమల్ హాసన్.. ఆ తర్వాత భావోద్వేగమైన సందేశాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని వాయిదా వేసేందుకే కమల్ మొగ్గు చూపుతున్నాడంట. ఆగష్టు 15న చిత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో కమల్ ఉన్నట్లు సమాచారం. రిలీజ్ వాయిదాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలుగు, తమిళంతోపాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. కమల్ స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌తోపాటు, ఆస్కార్ ఫిలింస్ విశ్వరూపం-2 ను సంయుక్తంగా నిర్మించాయి.
Comments
Please login to add a commentAdd a comment