సల్మాన్తో కత్రినా నటించడం లేదు: టిప్స్ | Katrina Kaif not to romance Salman Khan in Prabhu Deva's film | Sakshi
Sakshi News home page

సల్మాన్తో కత్రినా నటించడం లేదు: టిప్స్

Published Wed, Sep 4 2013 2:09 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సల్మాన్తో కత్రినా నటించడం లేదు: టిప్స్ - Sakshi

సల్మాన్తో కత్రినా నటించడం లేదు: టిప్స్

కండలవీరుడు సల్మాన్ఖాన్తో అందాల భామ కత్రినాకైఫ్ మరోసారి జత కట్టనుందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని తేలిపోయింది. ప్రభుదేవా తెరకెక్కించనున్న చిత్రంతో సల్మాన్ సరసన కత్రినా నటించడం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. 'వాంటెడ్' సినిమా బాక్సా ఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్పై అంచనాలు ఎక్కువయ్యాయి. ఈ సినిమాను టిప్స్ సంస్థ నిర్మించనుంది.

అయితే ఈ సినిమాలో సల్మాన్, కత్రినా జోడీ కట్టనున్నారని వార్తలు వచ్చాయి. ఇవన్నీ రూమర్లని నిర్మాతలు తెలిపారు. అసలు తాము కత్రినాను సంప్రదించలేదని వెల్లడించారు. ఇంకా స్క్రిప్ట్పై పనిచేస్తున్నామని, కథ సిద్ధం కాలేదని టిప్స్ ప్రతినిధి రమేష్ తౌరానీ పీటీఐతో చెప్పారు. సల్మాన్, కత్రినా చివరిసారిగా 'ఏక్ థా టైగర్' చిత్రంలో తెరపై కనిపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement