ముంబై : నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉంటూ తీరిక లేకుండా గడుపుతుంటారు సెలబ్రిటీలు. షూటింగ్ నుంచి కొంత వీలు లభిస్తే చాలు కుటుంబంతో విదేశాల పర్యటనకు వెళ్తుంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం షూటింగ్ సమయంలో యూనిట్‌తో కలిసి ఆటలాడారు. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, కిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న లెటెస్ట్ మూవీ సూర్యవంశీ. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి అక్షయ్ కుమార్‌తో కత్రినా చేస్తున్న సినిమా ఇది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక చిత్రం విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లలలో బిజీగా ఉన్నారు.
తాజాగా షూటింగ్ సమయంలో సరదాగా ఆడుతున్న ఓ వీడియోను కత్రినా కైఫ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పని ఒత్తిడిని కాసేపు పక్కన పెట్టి చిత్ర బృందంతో కలిసి ఆటలాడుతూ.. జాలీగా ఎంజాయ్ చేశారు. చిన్న పిల్లలా ఇసుకలో కర్రతో ఆడే ఆటను ఆడారు. రెండు జట్టులుగా ఏర్పడిన ఈ బృందంలో అక్షయ్, కత్రినా ఒక టీమ్‌గా ఉన్నారు. కత్రినా ఆడుతుండగా కిలాడీ ఆమెను పక్కన ఉండి ‘నువ్వు గెలవాలి కాట్ లేకపోతే ఓడిపోతావు’ అంటూ ఆమెను ప్రొత్సహించాడు. ఎట్టకేలకు ఆటలో కత్రినా పోరాడి.. విజయం సాధించడంతో ఎగిరి గంతేసింది. కాగా ఇంతక మందు కత్రినా సెట్లో ఊడుస్తూన్న ఓ వీడియోను అక్షయ్ కుమార్ షేర్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment