
సాక్షి, యాదాద్రి: ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పేరుతో ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి శనివారం యాదగిరి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. సినిమా స్క్రిప్ట్‌ను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా విజయవంతం కావాలని యాదగిరీశుడిని కోరుకున్నట్లు తెలిపారు.
అన్న ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమ వల్లే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఆయన గతంలోనే స్పష్టం చేశారు. కొందరు రాజకీయ నాయకులు ఆయన వెనుక ఉండి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నా వెనుక అన్నగారే ఉన్నారు. నాకు ఏ రాజకీయ పార్టీ అండదండలు లేవని గతంలోనే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment