‘ఇషూ.. నువ్వు ఇప్పటికి అలానే ఉన్నావ్‌’ | Kiara Advani Posts Amazing Photos Of Isha Ambani | Sakshi

‘ఇషూ.. నువ్వు ఇప్పటికి అలానే ఉన్నావ్‌’

Sep 24 2018 11:30 AM | Updated on Apr 3 2019 6:34 PM

Kiara Advani Posts Amazing Photos Of Isha Ambani - Sakshi

తన బెస్ట్‌ ఫ్రెండ్‌ ఇషా అంబానీకి శుభాకాంక్షలు తెలిపిన కియారా అద్వాని

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌ పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌తో ఇటలీలోని లేక్ కొమో వద్ద ఆదివానం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భరత్‌ అనే నేను ఫేం కియారా అద్వాని తన బెస్ట్‌ ఫ్రెండ్‌ ఇషాకు శుభాకాంక్షలు తెలుపుతూ అద్భుతమైన ఫోటోలను పోస్ట్‌ చేశారు. దాంతో పాటు ‘ప్రతి ఒక్కరి జీవితంలో కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వారు మనతో పాటు పెరుగుతూ మన జీవితాంతం కలిసి ఉంటారు. ఇషు.. నేను నిన్ను తొలిసారి కలిసినప్పుడు నువ్వు ఎంత వినయంగా ఉన్నావో ఇప్పటికి అలానే ఉంటూ అంతే శ్రద్దగా నన్ను చూసుకోవడం నిజంగా అద్భుతం. మన బాల్యాన్ని ఎన్నటికి మరవను.. ఇషా అంబానీ, ఆనంద్‌ పిరమాల్‌కు అభినందనలు ప్రేమతో నీ అలియూ’ అనే సందేశాన్ని పోస్టు చేశారు.

రిలయన్స్‌ అధినేత గారాల పట్టి ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌ పిరమాల్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ జరిగింది. నిశ్చితార్థం వేడుకలో ఇషా పీచ్‌ కలర్‌ డిజైనర్‌ గౌన్‌లో మెరిసిపోగా ఆనంద్‌ పిరమాల్‌ గ్రీన్‌ కలర్‌ షేర్వానీలో వెలిగిపోయారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకకు సోనమ్‌ కపూర్‌ దంపతులు, ప్రియాంక చోప్రా - నిక్‌ జోనాస్‌, జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌, కరణ్‌ జోహర్‌, మనీష్‌ మల్హోత్ర వంటి బాలీవుడ్‌ ప్రముఖలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement