
ఆ డబ్బుతో ఆకలి తీర్చండి : స్టార్ హీరో
బొమ్మనహళ్లి : బహుభాషా నటుడు కిచ్చ సుదీప్ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక పైన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం లేదని చెప్పారు. తన పుట్టినరోజునాడు ఎంతో మంది అభిమానులు బెంగళూరు, రాష్ట్రం పలుప్రాంతాల నుంచి ఎంతో వ్యవ ప్రయాసలతో వస్తుంటారని, వారి అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని హీరో సుదీప్ అన్నారు.
సెప్టెంబర్ 2వ తేదీన తన పుట్టినరోజని, ఆ రోజు ఘనంగా వేడుకలను జరపాలని కొందరు బలవంతం చేస్తున్నారని చెప్పారు. అలాంటి పనులేమీ చేయవద్దని అన్నారు. నా కోసం తీసుకొని వచ్చే పూలదండలు, స్వీట్లు, బాణాసంచాలు, ఇలాంటి వాటికి డబ్బులు వృథాగా ఖర్చు చేయకుండా, ఆ డబ్బులతో పేదలకు ఒక్క పూట కడుపునిండా భోజనం పెట్టిఆకలి తీర్చాలని సుదీప్ తన ట్విట్టర్ ఖాతాలో పిలుపునిచ్చారు.
ఈ విషయంలో అభిమానులు తనను అర్థం చేసుకోవాలని కోరారు. బుధవారం కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ పుట్టినరోజు కూడా ఉంది. కానీ ఇటీవలే ఆయన తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్ మరణించడంతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోరాదని నిర్ణయించారు.
A small request to all my friends,,
— Kichcha Sudeepa (@KicchaSudeep) 11 July 2017
Hope my words r respected.
Much luv,,
Kichcha. https://t.co/c2ogH7lehe