సూపర్‌మార్కెట్‌ ప్రేమ | Krishna Rao Super Market movie completes post production work | Sakshi
Sakshi News home page

సూపర్‌మార్కెట్‌ ప్రేమ

Published Sun, Mar 17 2019 3:23 AM | Last Updated on Sun, Mar 17 2019 3:23 AM

Krishna Rao Super Market movie completes post production work - Sakshi

కృష్ణ, ఎల్సా ఘోష్‌

హాస్య నటుడు గౌతమ్‌రాజు తనయుడు కృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌’. ఎల్సా ఘోష్‌ కథానాయికగా నటించారు. ఈ చిత్రం ద్వారా శ్రీనాథ్‌ పులకురం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బి.జి.ఆర్‌ ఫిలిం అండ్‌ టీవీ స్టూడియోస్‌ పతాకంపై గౌతమ్‌రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకుని, సెన్సార్‌ కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌ నేపథ్యంలో నడిచే ప్రేమకథా చిత్రమిది. సస్పెన్స్‌ ప్రధానంగా సాగుతుంది. వినోదం, ప్రేమ.. వంటి అన్ని అంశాలతో ఆద్యంతం సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, జీవా, గౌతంరాజు, బెనర్జీ, రవిప్రకాష్, సంజు, స్వరూప్‌చందు, సూర్య, సనా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎ. విజయ్‌కుమార్, సంగీతం: బోలేషావలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement