goutham raju
-
ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబానికి చిరు తక్షణ సాయం
సినీ ఎడిటర్ గౌతమ్‌రాజు (68) అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతు గౌతమ్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా గౌతమ్‌రాజు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు తక్షణ సాయం కింద తాజాగా 2 లక్షల రూపాయలను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా అందజేశారు. చదవండి: బాలీవుడ్ స్టార్ హీరోకు విలన్‌గా విజయ్ సేతుపతి? ఈ మేరకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రెండు లక్షల రూపాయలను ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అనంతరం వారికి అండగా ఉంటామని, ధైర్యం కోల్పోవద్దని చిరు కుటుంబం తరపున ఆయన కుటుంబానికి ధైర్యం ఇచ్చారు. ఇది విషయాన్ని తమ్మారెడ్డి మీడియాకు వెల్లడించారు. కాగా గౌతమ్ రాజు ఎడిటర్‌గా 800లకు పైగా చిత్రాలకు పనిచేశారు. సినీ ఇండస్ట్రీలో ఆయనకు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. చిరు సినిమాలైన ‘చట్టానికి కళ్లు లేవు’ చిత్రం నుంచి ‘ఖైదీ నం.150’ వరకు తన ఎన్నో చిత్రాలకు గౌతమ్ రాజు ఎడిటర్‌గా పనిచేసినట్లు చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు. -
గౌతమ్ రాజుని కోల్పోవడం దురదృష్టకరం : చిరంజీవి
ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు(68) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగా ఢ సానుభూతి తెలియజేశాడు. ‘ గౌతమ్ రాజు లాంటి గొప్ప ఎడిటర్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన ఎంత సౌమ్యుడో.. ఆయన ఎడిటింగ్ అంత వాడి. ఆయన మితభాషి, కానీ ఆయన ఎడిటింగ్ మెళకువలు అపరిమితం. ఎంత నెమ్మదస్తుడో.. ఆయన ఎడిటింగ్ అలంత వేగం. ‘చట్టానికి కళ్లు లేవు’ చిత్రం నుంచి ‘ఖైదీ నం.150’ వరకు నా ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతమ్ రాజు గారు లేకపోవటం వ్యక్తిగతంగా నాకూ, మొత్తం సినీ పరిశ్రమకు పెద్ద లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను’అని చిరంజీవి ట్వీట్ చేశారు. (చదవండి: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత) కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతమ్ రాజు మంగళవారం అర్థరాత్రి హైదాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 800కిపైగా సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. ఖైదీ నెంబర్ 150, గబ్బర్‌సింగ్, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపు, ఊసరవెల్లి, బద్రీనాథ్ సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ అనేక సినిమాలకు ఆయన పనిచేశారు. Rest In Peace Gowtham Raju garu! pic.twitter.com/kmkii0wM8K — Chiranjeevi Konidela (@KChiruTweets) July 6, 2022 -
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సినీ ఎడిటర్ గౌతమ్‌రాజు (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో భాదపడుతున్నారు. నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన మరణించారు. 800కిపైగా సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. ఖైదీ నెంబర్ 150, గబ్బర్‌సింగ్, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపు, ఊసరవెల్లి, బద్రీనాథ్ సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ అనేక సినిమాలకు ఆయన పనిచేశారు. గౌతమ్‌రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. చదవండి: (Mahua Moitra: మాంసం తినే మద్యం తాగే దేవత) -
'కఠారి కృష్ణ'పై మంత్రి హరీష్ రావు స్పందన.. ఏమన్నారంటే ?
Minister Harish Rao Comments On Katari Krishna Movie: ‘‘మన తెలంగాణ బిడ్డ, వ్యాపారవేత్త అయిన ఆలమయ్య నాయుడు (పి.ఎ. నాయుడు) నిర్మాతగా మారి ‘కఠారి కృష్ణ’ అనే సినిమాను నిర్మించడం సంతోషం. సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించి సందేశాత్మక చిత్రాలు నిర్మించాలని సంకల్పించడం అభినందనీయం’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ, చాణక్య, రేఖా నిరోష, యశ్న చౌదరి, స్వాతి మండల్ ముఖ్య పాత్రల్లో ప్రకాశ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కఠారి కృష్ణ’. పీఏ నాయుడు, నాగరాజు తిరుమల శెట్టి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజవుతున్న సందర్భంగా చిత్రం విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు. ఈ సినిమా ట్రైలర్‌ని ఇటీవలే ప్రముఖ నటుడు మురళీమోహన్ విడుదల చేశారు. ‘‘అడుగడుగునా ఆసక్తి రేకెత్తించే కథ, కథనాలతో కూడిన చిత్రమిది. కఠారి కృష్ణ పోరాటం ఎవరి కోసం అనేది తెరపై చూడాలి. మురళీమోహన్, మంచు విష్ణు, తనికెళ్ల భరణి, రామ్ లక్ష్మణ్ తదితరులు విడుదల చేసిన ప్రచార చిత్రాలకి, ట్రైలర్‌కి చక్కటి స్పందన లభిస్తోంది. చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం పద్మనాభవ్ భరద్వాజ్ అందించారు. -
‘ది ట్రిప్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో వీడీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం ది ట్రిప్. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ది ట్రిప్ పేరుతో వచ్చిన ఈ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. పోస్టర్ చూస్తుంటే రొటీన్‌కు కాస్త భిన్నంగానూ అనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. కార్తిక్ కొడకండ్ల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. -
పాలమూరులో హీరో, హీరోయిన్ల సందడి
సాక్షి, మహబూబ్‌నగర్: ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ సినిమా హీరో, హీరోయిన్లు గురువారం పాలమూరు పట్టణంలో సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని వెంకటాద్రి థియేటర్లో కృష్ణారావు సూపర్ మార్కెట్ సినిమా నేడు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా థియేటర్ ఆవరణలో హీరో, హీరోయిన్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. హీరోయిన్ ఎలిషా ఘోష్ మాట్లాడుతూ.. ఇదివరకు వివిధ భాషల్లో తొమ్మిది సినిమాలు నటించానని, తెలుగులో తొలి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉందన్నారు. హీరో కృష్ణంరాజు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని జేపీఈఎన్సీ కళాశాలలో ఇంజనీరింగ్ చదివానని, అందువల్ల జిల్లా అంటే ప్రత్యేక అభిమానం ఉందని, కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని అన్నారు. జేపీఎన్సీఈ కళాశాల చైర్మన్ కేఎస్.రవికుమార్ మాట్లాడుతూ ప్రముఖ కమెడియన్ గౌతంరాజు కుమారుడు కృష్ణంరాజు మూడో సినిమా చేస్తున్నాడని, గౌతంరాజుతో తనకు ఏన్నో ఏళ్ల నుంచి స్నేహం ఉందన్నారు. సమావేశంలో థియేటర్ యజమాని గుద్దేటి శివకుమార్ పాల్గొన్నారు. -
కమెడియన్ల పిల్లలు కమెడియన్లు కాదు...
కమెడియన్ గౌతంరాజ్ నిర్మాతగా ఆయన కుమారుడు కృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’. శ్రీనాథ్ పులకరం దర్శకుడు. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్రం బిగ్ సీడీని అనిల్ రావిపూడి, ట్రైలర్‌ను బ్రహ్మానందం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అంబికా కృష్ణ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ‘మా’ అధ్యక్షుడు వి.కే. నరేశ్‌లతో పాటు తనికెళ్లభరణి, బెనర్జీ, కృష్ణభగవాన్, శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు, అలీ, రాజీవ్ కనకాల, తదితరులు పాల్గొన్నారు. నరేశ్ మాట్లాడుతూ– ‘‘గౌతమ్ 400 సినిమాలకు పైగా నటించారు. నాకు 30 ఏళ్లుగా మంచి స్నేహితుడు. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న గౌతంరాజు నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘హాస్య కుటుంబం నుండి వచ్చిన పిల్లలు హాస్యానికే పరిమితం అనుకుంటారు. అది నిజం కాదు అని నిరూపించుకోవటానికే కృష్ణ మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు. గౌతంరాజు మాట్లాడుతూ– ‘‘నా మీద అభిమానంతో ఇంతమంది ఇక్కడికొచ్చి నా కొడుకును ఆశీర్వదించారు. ఇంతమంచి చిత్రాన్ని తీసిన దర్శకుడు శ్రీనా«థ్ పులకరంకి థ్యాంక్స్’’ అన్నారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ చిత్రమిది’’ అన్నారు. -
పాల్వంచలో సినీతారల సందడి
సాక్షి, పాల్వంచ: పట్టణంలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రముఖ హాస్య నటుడు గౌతంరాజు నిర్మాతగా తీసిన ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా కళాశాలలో సినిమా పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌతంరాజు కుమారుడు కృష్ణంరాజు హీరోగా, కోల్‌కతాకు చెందిన హీరోయిన్ హెల్సాగోష్, దర్మకుడు శ్రీనాథ్‌లు మాట్లాడారు. సస్పెన్స్ థ్రిల్లర్‌తోపాటు ప్రేమకథా చిత్రంగా దీనిని తెరకెక్కించామని, సినిమాను అక్టోబర్ 18న రిలీజ్ చేస్తామని తెలిపారు. తెలుగు ప్రజలు దీనిని విజయవంతం చేసి ఆదరించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్ధులతో కలిసి హీరోహీరోయిన్లు కృష్ణంరాజు, హెల్సాగోష్ నృత్యం చేసి ఉర్రూతలూగించారు. అనంతరం కళాశాల చైర్మన్ టి.భరత్ చిత్ర బృందానికి జ్ఞాపికలు అందించారు. కొత్త తరహా చిత్రం ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ చిన్న సినిమా అయినా కొత్త తరహా చిత్రం ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ అని నిర్మాత, ప్రముఖ హాస్యనటుడు గౌతంరాజు, హీరో కృష్ణంరా జు అన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. తొలుత గౌతంరాజు మాట్లాడు తూ సస్పెన్స్ థ్రిల్లర్ కథ బాగుండటంతో తానే సొంతంగా సినిమా తీసేందుకు ముందుకొచ్చానన్నారు. సినిమా తీయడం ఒక ఎత్తయితే దానిని రిలీజ్ చేయడం ఎంతో కష్టంతో కూడుకుందని, తాను సుమారు 300 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమని, తనలానే తన కొడుకు హీరోగా వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇందులో కీలక పాత్రదారులుగా తనికెళ్ల భరణి, బెనర్జీ, సన, రవి ప్రకాష్ నటించగా, ఎడిటర్ వెంకటేశ్వరరావు, ఫైట్స్ సింధూరం సతీశ్ సమకూర్చారని చెప్పారు. అనంతరం కృష్ణంరాజు మాట్లాడారు. సినిమాలో అర్జున్ పాత్ర బాక్సర్ కావడంతో 6 ఫైట్స్ ఎలాంటి డూప్ లేకుండా చేశానని తెలిపారు. హీరోయిన్ హెల్సాగోష్ మాట్లాడుతూ కన్నడంలో మొత్తం 11 సినిమాల్లో నటించానని, తెలుగులో ఇది తన మొదటి సినిమా అని పేర్కొన్నారు. -
సూపర్ మార్కెట్లో సస్పెన్స్
హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’. ఎల్సా గోష్ కథానాయిక. బీజేఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా శ్రీనాథ్ పులకరం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనాథ్ పులకరం మాట్లాడుతూ – ‘‘మార్కెట్ చుట్టూనే కథ నడుస్తుంది కాబట్టి ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ అని టైటిల్ పెట్టాం. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. కృష్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయనకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్‌కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో మా సినిమాకు మంచి బజ్ వచ్చింది’’ అన్నారు నిర్మాతలు. -
తండ్రులు చాలా గొప్పవారు
‘‘ధర్మేంద్ర, బెల్లంకొండ సురేష్ తమ కొడుకుల కోసం చాలా కష్టపడ్డారు. వాళ్లలాగా ఈరోజు గౌతంరాజు కూడా తన కొడుకుని హీరో చెయ్యాలని చేస్తున్న సంకల్పం చాలా గొప్పది. అందుకే తండ్రులు చాలా గొప్పవారు. తండ్రి రుణం తీర్చుకోవాలని కృష్ణని కోరుతున్నాను. ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ సినిమా బాగా నచ్చింది. మంచి హిట్ అవుతుంది’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కృష్ణారావ్ సూపర్‌మార్కెట్’. శ్రీనాధ్ పులకరం దర్శకత్వంలో బిజెఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘నారాయణమూర్తిగారు మంచి నీళ్లలాంటి వారు. అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. గౌతంరాజు కోసం ఇంత మంది వచ్చారు. చిన్న సినిమాల్లోనే మాకు చాలా ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయి. మాకు మంచి గుర్తింపు కూడా వస్తుంది’’ అన్నారు. ‘‘సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా అని గౌతంరాజు చెప్పగానే.. ‘ఎందుకు ఇంత రిస్క్ చేశావ్?’ అన్నాను. నా కొడుకుని హీరోగా పరిచయం చెయ్యాలనుకున్నాను.. అది నా లక్ష్యం అన్నారు’’ అని నటుడు సుమన్ అన్నారు. ‘‘సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రం కోసం నాకు చాలా మంది సహాయం చేశారు’’ అన్నారు గౌతంరాజు. ‘‘నా కెరియర్‌కి ఇది మంచి మూవీ అవుతుంది’’ అన్నారు కృష్ణ. ‘‘గౌతంరాజుగారికి కథ బాగా నచ్చి, సినిమా తీశారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్’’ అని శ్రీనాధ్ పులకురవ్ అన్నారు. -
సూపర్‌మార్కెట్ ప్రేమ
హాస్య నటుడు గౌతమ్‌రాజు తనయుడు కృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘కృష్ణారావ్ సూపర్‌మార్కెట్’. ఎల్సా ఘోష్ కథానాయికగా నటించారు. ఈ చిత్రం ద్వారా శ్రీనాథ్ పులకురం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బి.జి.ఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ పతాకంపై గౌతమ్‌రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని, సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కృష్ణారావ్ సూపర్‌మార్కెట్ నేపథ్యంలో నడిచే ప్రేమకథా చిత్రమిది. సస్పెన్స్ ప్రధానంగా సాగుతుంది. వినోదం, ప్రేమ.. వంటి అన్ని అంశాలతో ఆద్యంతం సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, జీవా, గౌతంరాజు, బెనర్జీ, రవిప్రకాష్, సంజు, స్వరూప్చందు, సూర్య, సనా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎ. విజయ్‌కుమార్, సంగీతం: బోలేషావలి. -
అమ్మ, నాన్నలకు ఇష్టం లేకపోయినా ...
విజయవాడ: తెలుగు సినీ పరిశ్రమలో నటులకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోదని ప్రముఖ హాస్య నటుడు గౌతంరాజు అన్నారు. చిన్న సినిమాలను నమ్ముకున్న ఆర్టిస్టులకు కష్టాలే ఎదురవుతున్నాయని చెప్పారు. పరభాషా నటులపై వ్యామోహం, డబ్బింగ్ సినిమాల ప్రభావంతో తెలుగు సినీ పరిశ్రమ కుదేలవుతోందన్నారు. స్థానిక పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీష్‌కుమార్ కార్యాలయానికి శనివారం విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రశ్న: మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? జవాబు : నాలుగో తరగతి నుంచే రాజమండ్రిలో నాటకాలు వేసేవాళ్లం. చిన్నతనం నుంచే రంగస్థలంపై పలు ప్రదర్శనలు ఇవ్వడంతో సినిమాలపై ఆసక్తి కలిగింది. అమ్మ, నాన్నలకు ఇష్టం లేకపోయినా డిగ్రీ పూరైన తర్వాత హైదరాబాదు వచ్చి ఇంటర్మీడియట్ బోర్డులో ఉద్యోగం చేస్తూ పరిశ్రమలో అవకాశాల కోసం వేట ప్రారంభించా. 1985లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన వసంతగీతం సినిమాతో తొలి అవకాశం వచ్చింది. ప్ర : ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చిన పాత్ర ఏది? జ : కూలీ నెం.1 సినిమా చేస్తున్న సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గమనించి, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజివి నటించిన ఘరానా మెగుడు చిత్రంలో మంచి పాత్ర ఇచ్చారు. దానితో మంచి గుర్తింపు వచ్చింది. ప్ర : ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు? జ : 25 ఏళ్ల సినీ జీవితంలో హస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 400 పైచిలుకు చిత్రాల్లో నటించా. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో మేస్త్రీలో చేసిన పాత్ర, ఉదయ్‌కిరణ్ ఆఖరి చిత్రం జైశ్రీరామ్‌లో విలన్‌గా నటించడం తృప్తిని ఇచ్చాయి. ప్ర : ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో చిన్న నటీనటులకు అవకాశాలు ఎలా ఉన్నాయి? జ : చిన్న సినిమాలు బాగా తగ్గిపోవడంతో వీటిపై ఆధారపడిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల జీవితాలు దారుణంగా మారుతున్నాయి. మన దర్శక, నిర్మాతలు పరభాష నటులపై ఆసక్తి చూపడం కూడా తెలుగు నటుల అవకాశాలను దెబ్బతీస్తోంది. ప్ర : డబ్బింగ్ చిత్రాల ప్రభావం ఎంతవరకు ఉంది? జ : తెలుగు నటీ, నటులకు అవకాశాలు తగ్గిపోవడానికి డబ్బింగ్ చిత్రాలు కూడా కారణమే. డబ్బింగ్ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమకు ముప్పు పొంచి ఉంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాలను ఇప్పటికే నిషేధించారు. ఆ విధానాన్ని ఇక్కడ అమలు చేయకపోతే పరిశ్రమ భవిష్యత్ ప్రశ్నార్ధకమే. ప్ర : ప్రస్తుతం ఏఏ చిత్రాల్లో నటిస్తున్నారు? జ : రామ్‌చరణ్- శ్రీనువైట్ల, సాయిధరమ్ తేజ - హరీష్‌శంకర్, బాలకృష్ణ- శ్రీవాస్ కాంబినేషన్లలో రూపొందుతున్న చిత్రాలతో పాటు, శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న మరో రెండు చిత్రాల్లోను మంచి పాత్రలను పోషిస్తున్నా. ప్ర : మీ అబ్బాయి కృష్ణంరాజు సినిమాలు ఏవి? జ : మా అబ్బాయి కృష్ణంరాజు హీరోగా ప్రస్తుతం ‘లక్ష్మీదేవి సమర్పించు- నేడే చూడండి’, ‘నాకైతే నచ్చింది’ చిత్రాల్లో నటిస్తున్నాడు. కృష్ణుడుతో కలిసి మరో హర్రర్ మూవీ కూడా చేస్తున్నాడు.