
Minister Harish Rao Comments On Katari Krishna Movie: ‘‘మన తెలంగాణ బిడ్డ, వ్యాపారవేత్త అయిన ఆలమయ్య నాయుడు (పి.ఎ. నాయుడు) నిర్మాతగా మారి ‘కఠారి కృష్ణ’ అనే సినిమాను నిర్మించడం సంతోషం. సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించి సందేశాత్మక చిత్రాలు నిర్మించాలని సంకల్పించడం అభినందనీయం’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ, చాణక్య, రేఖా నిరోష, యశ్న చౌదరి, స్వాతి మండల్ ముఖ్య పాత్రల్లో ప్రకాశ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కఠారి కృష్ణ’. పీఏ నాయుడు, నాగరాజు తిరుమల శెట్టి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజవుతున్న సందర్భంగా చిత్రం విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు.
ఈ సినిమా ట్రైలర్‌ని ఇటీవలే ప్రముఖ నటుడు మురళీమోహన్ విడుదల చేశారు. ‘‘అడుగడుగునా ఆసక్తి రేకెత్తించే కథ, కథనాలతో కూడిన చిత్రమిది. కఠారి కృష్ణ పోరాటం ఎవరి కోసం అనేది తెరపై చూడాలి. మురళీమోహన్, మంచు విష్ణు, తనికెళ్ల భరణి, రామ్ లక్ష్మణ్ తదితరులు విడుదల చేసిన ప్రచార చిత్రాలకి, ట్రైలర్‌కి చక్కటి స్పందన లభిస్తోంది. చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం పద్మనాభవ్ భరద్వాజ్ అందించారు.