ఇప్పుడు భయం పోయింది! | Kriti Sanon is overcoming her fears on Raabta sets | Sakshi
Sakshi News home page

ఇప్పుడు భయం పోయింది!

Published Wed, Mar 2 2016 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

ఇప్పుడు భయం పోయింది!

ఇప్పుడు భయం పోయింది!

 నీళ్లల్లోకి దిగడం అంటే మన ‘1’ హీరోయిన్ కృతీ సనన్‌కి ప్రాణం పోయినంత పని అవుతుందట. పాపం... అందుకే ఈత కూడా నేర్చుకోలేకపోయారు. ఇన్నేళ్లూ ఈత కొట్టాల్సిన అవసరం రాకపోవడంతో కృతీకి ఇబ్బంది కలగలేదు. కానీ, ఇప్పుడు మాత్రం పెద్ద ఇబ్బందే ఎదురయ్యింది. హిందీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన ఆమె నటిస్తున్న చిత్రం ‘రాబ్తా’. ఈ చిత్రం కోసం కృతీ సనన్ ఈత కొట్టాలన్న మాట.
 
  చిత్రదర్శకుడు దినేష్ విజన్ ఈ విషయం గురించి చెప్పగానే, ఈ బ్యూటీ భయపడిపోయారు. కానీ, చేయనంటే బాగుండదు కదా! అందుకని భయాన్ని పక్కన పెట్టి, ఈత నేర్చుకోవడం మొదలుపెట్టారామె. ప్రతిరోజూ ఉదయం దాదాపు గంట సేపు ఈత నేర్చుకున్నారు. ఆ విషయం గురించి కృతీ సనన్ చెబుతూ- ‘‘ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాక భయం పోయింది. మొదటి రోజు బాగా భయపడిపోయాను. రెండో రోజుకి కాస్త భయం తగ్గింది.
 
 మూడో రోజు ఇంకాస్త! ఇలా రోజు రోజుకీ కొంచెం కొంచెంగా భయం తగ్గిపోయింది. ఇప్పుడు ఈత కొలనులో దిగడం నాకు చాలా ఈజీ’’ అని తెలిపారు. ఒకప్పుడు ఈత కొట్టడం భయం అని చెప్పుకుంటూ వచ్చిన కృతి ఇప్పుడు ‘నాకా..? భయమా...’ అని ధీమాగా అంటున్నారు. కాగా, ఈ చిత్రం కోసం ఈత కొట్టడమే కాదు... గుర్రపు స్వారీ కూడా కృతీసనన్ నేర్చుకున్నారు. మొత్తం మీద ఈ సినిమా తనకో సవాల్ అంటున్నారామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement