
హీరోయిన్ కొత్త డ్రెస్.. ఇంటర్ నెట్‌లో వైరల్!
ముంబయి: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన హీరోయిన్ కృతి సనన్ వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ లో మహేశ్ బాబు సరసన '1 నేనొక్కడినే', నాగచైతన్యతో 'దోచేయ్' లో నటించిన ఈ ముద్దుగుమ్మ ధరించిన ఓ గౌను హాట్ టాపిక్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన రూ.2000 కొత్తనోట్లతో డిజైన్ చేసిన గౌనును కృతి సనన్ ధరించినట్లుగా ఉన్న ఫొటోలు ఇంటర్ నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా హీరోయిన్లు తమ డిజైనర్లతో చెప్పి మూవీల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం డ్రెస్సులు డిజైన్ చేయిస్తుంటారు.
ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు తర్వాత జనాలు బ్యాంకులు క్యూ కడుతుండగా, హీరోయిన్ మాత్రం రూ.2000 నోట్లతో డిజైన్ చేసిన కొత్త డ్రెస్ లో మెరిపిపోయింది. కొందరు మాత్రం ఫొటో చాలా సహజంగా కనిపిస్తున్నా, ఇది మనం నమ్మరాదని అంటున్నారు. మార్ఫింగ్ చేసిన ఫొటో అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫొటో చూస్తే మాత్రం ఓ ఈవెంట్లో హాజరై ఆమె ఫొటోలకు ఫోజులిచ్చినట్లు కనిపిస్తోంది. ఏది ఏమైతేనేం సినిమాలతో రాని క్రేజ్ ఇలాంటి ఫొటోలతోనైనా కృతికి వచ్చిందని, అసలే ఆమెకు సక్సెస్ అందించిన మూవీలు లేవని సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం అవుతున్నాయి.