Rs. 2000 Note
-
హీరోయిన్ కొత్త డ్రెస్.. ఇంటర్ నెట్లో వైరల్!
ముంబయి: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన హీరోయిన్ కృతి సనన్ వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ లో మహేశ్ బాబు సరసన '1 నేనొక్కడినే', నాగచైతన్యతో 'దోచేయ్' లో నటించిన ఈ ముద్దుగుమ్మ ధరించిన ఓ గౌను హాట్ టాపిక్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన రూ.2000 కొత్తనోట్లతో డిజైన్ చేసిన గౌనును కృతి సనన్ ధరించినట్లుగా ఉన్న ఫొటోలు ఇంటర్ నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా హీరోయిన్లు తమ డిజైనర్లతో చెప్పి మూవీల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం డ్రెస్సులు డిజైన్ చేయిస్తుంటారు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు తర్వాత జనాలు బ్యాంకులు క్యూ కడుతుండగా, హీరోయిన్ మాత్రం రూ.2000 నోట్లతో డిజైన్ చేసిన కొత్త డ్రెస్ లో మెరిపిపోయింది. కొందరు మాత్రం ఫొటో చాలా సహజంగా కనిపిస్తున్నా, ఇది మనం నమ్మరాదని అంటున్నారు. మార్ఫింగ్ చేసిన ఫొటో అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫొటో చూస్తే మాత్రం ఓ ఈవెంట్లో హాజరై ఆమె ఫొటోలకు ఫోజులిచ్చినట్లు కనిపిస్తోంది. ఏది ఏమైతేనేం సినిమాలతో రాని క్రేజ్ ఇలాంటి ఫొటోలతోనైనా కృతికి వచ్చిందని, అసలే ఆమెకు సక్సెస్ అందించిన మూవీలు లేవని సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం అవుతున్నాయి. -
రూ.2 వేల నోటు టెస్టింగ్ వీడియో సంచలనం
న్యూఢిల్లీ: నాన్ బ్రేకబుల్ వస్తువులను ఎత్తయిన ప్రదేశాలనుంచి కిందపడేసి టెస్ట్ చేయడం చూశాం....వాటర్ ప్రూఫ్ స్మార్ట్ఫోన్లు పరీక్షించడం చూశాం.. ఇపుడు రెండు వేల రూపాయల నోటు వంతు వచ్చింది. అవును.. కొత్తగా ప్రజల చేతుల్లో కళకళలాడుతున్న రెండువేల నోటును కడుగుతున్న వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతుంది. ట్యాప్ లోంచి ధారాళంగా పడుతున్న నీటి కింద రూ.2000 నోటును ఒక వ్యక్తి కడుగుతున్న వీడియో ఒకటి సంచలనం రేపుతోంది. ఎవరు..ఎక్కడ చేశారు అనేవివరాలు తెలియనప్పటికీ.. ఆదివారం సోషల్ మీడియా షేర్ అయిన క్షణాల్లో వైరల్ అయిది. లక్షల కొద్దీని వ్యూస్ ను సొంతం చేసుకుంటూ యూ ట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. ఫేస్బుక్ లాంటి ఇతర సోషల్ మీడియాలలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. కాగా కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టేందుకు దేశంలో 500, 1000 రూపాయల నోట్ల చలామణిని రద్దుచేసింది. ఈ క్రమంలో కొత్తగా రెండువేల రూపాయల నోట్లు చలామణిలోకి వచ్చాయి. అయితే ఈ కొత్త నెట్ సెక్యూరిటీ ఫీచర్స్ పై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అపుడే నకిలీ నోట్లు చలామణిలోకి వచ్చాయనే వార్తలు ప్రజల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
రూ.2 వేల టెస్టింగ్ వీడియో సంచలనం