ప్రియుడికి టీవీ నటి గుడ్ బై | Kritika Kamra splits with boyfriend | Sakshi
Sakshi News home page

ప్రియుడికి టీవీ నటి గుడ్ బై

Mar 13 2016 12:39 PM | Updated on Sep 3 2017 7:40 PM

ప్రియుడికి టీవీ నటి గుడ్ బై

ప్రియుడికి టీవీ నటి గుడ్ బై

ప్రముఖ హిందీ టీవీ నటి కృతికా కర్మా తన బాయ్ ఫ్రెండ్ తో తెగతెంపులు చేసుకుంది.

ముంబై: ప్రముఖ హిందీ టీవీ నటి కృతికా కర్మా తన బాయ్ ఫ్రెండ్ తో తెగతెంపులు చేసుకుంది. ఏడాదిన్నరగా కార్పొరేట్ ప్రొఫెనషల్ సిద్దార్థ్ బిజపూరియాతో సహజీవనం సాగించిన కృతిక అతడికి గుడ్ బై చెప్పింది. ఖర్ ప్రాంతంలోని తన అపార్ట్ మెంట్ నుంచి మరో ఫ్లాట్ కు సిద్ధార్థ్ మారిపోయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే వీరి బ్రేకప్ కు కారణాలు వెల్లడికాలేదు.

'కృతిక, సిద్దార్థ్ చాలా సంతోషంగా ఉండేవారు. వీరిద్దరూ విడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. సెలవుల్లో ఇద్దరూ ఎంతో సరదాగా గడిపారు. సిద్దార్థ్ ఇంట్లో జరిగే ఫ్యామిలీ ఫంక్షన్లకు ఆమె హాజరయ్యేది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు కనబడేవారు. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో తెలియదు. కారణం వాళ్లిద్దరికే తెలియాలి' అని విశ్వసనీయ వర్గాలు వివరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement