అజిత్ చెల్లెలిగా లక్ష్మీమీనన్ | Lakshmi Menon to play Ajith's sister as Nithya opts out | Sakshi
Sakshi News home page

అజిత్ చెల్లెలిగా లక్ష్మీమీనన్

Published Sat, Apr 18 2015 1:53 AM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

అజిత్ చెల్లెలిగా లక్ష్మీమీనన్ - Sakshi

అజిత్ చెల్లెలిగా లక్ష్మీమీనన్

నటుడు అజిత్ చెల్లెలిగా మారబోతున్నారు నటి లక్ష్మీమీనన్. ఎన్నై అరిందాల్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత నటుడు అజిత్ నటించనున్న చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఆరంభం, ఎన్నై అరిందాల్ చిత్రాల తరువాత శ్రీ సాయిరామ్ ఫిలింస్ అధినేత ఏఎం రత్నం నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిత్ర కథ అన్నాచెల్లెలి ఇతివృత్తంగా తెరకెక్కనున్నట్లు తెలిసింది.

ఇందులో చెల్లెలి పాత్ర కీలకం కావడంతో ఆ పాత్రలో నటించే నటి కోసం సుదీర్ఘ చర్చలు జరిగినట్టు తెలిసింది. నటి నిత్యామీనన్, శ్రీదివ్యల్లో ఒకరిని ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసినట్లు సమాచారం. నటి నిత్యామీనన్ అజిత్‌కు చెల్లెలిగా నటించడానికి నిరాకరించినట్లు తెలిసింది. ఇక శ్రీదివ్య కూడా ఈ విషయంలో మౌనం దాల్చినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీంతో నటి లక్ష్మీమీనన్‌ను అజిత్‌కు చెల్లెలి ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.

కుంకి నుంచి కొంభన్ వరకు వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ కేరళ కుట్టి ఇటీవల ప్లస్‌టూ పరీక్షల కోసం నటనకు చిన్న విరామం తీసుకున్నారు. పరీక్షలు ముగియడంతో నటనకు రెడీ అని ప్రకటించారు. చిన్న గ్యాప్ తరువాత లక్ష్మీమీనన్ నటించనున్నది చెల్లెలి పాత్ర కావడం గమనార్హం. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement