మన అనుకుంటే... | Lavanya Tripathi teams up with Allu Sirish | Sakshi
Sakshi News home page

మన అనుకుంటే...

Published Sun, Jul 17 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

మన అనుకుంటే...

మన అనుకుంటే...

 ‘కుటుంబం అంటే పక్కింట్లో వాళ్ల విషయం కాదు.. మనది, మన ఇంటికి సంబంధించిన అంశం. మన అనుకుంటే ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు’ అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ (బుజ్జి) దర్శకుడు.
 
 ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో పాటల్ని, ఆగస్టు 5న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలకు విలువ తగ్గుతున్న ఈ రోజుల్లో వాటిని గుర్తు చేసే చిత్రమిది. ఓ మంచి కుటుంబం, అన్ని భావోద్వేగాలు ఉంటాయి. శిరీష్, లావణ్య మధ్య సన్నివేశాలు యువతను ఆకట్టుకుంటాయి.
 
  ప్రతి సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ - ‘‘చక్కని కుటుంబ కథా చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు బుజ్జి చిత్రాన్ని తీశారు. టీజర్‌కి మంచి స్పందన లభించింది. తమన్ సంగీతం చిత్రానికి ప్లస్ అవుతుంది’’ అన్నారు.  ఈ చిత్రానికి యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగరాజు, కెమేరా: మని కంతన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement