ముంబై : లాక్‌డౌన్ కాలంలో అత్యవసర విభాగాల్లో అవిశ్రాంతంగా సేవలందిస్తున్న వారందరికీ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్లు, నర్సులు, పోలీస్, పారిశుద్ధ్య కార్మికుల సేవలను ఆయన కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం ట్విటర్‌లో ఓ పోస్ట్‌చేశారు. ‘మహారాష్ట్ర పోలీసు, డాక్టర్లు, పరిపాలనా విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది, మహారాష్ట్ర పారిశుద్ధ్య కార్మికులు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందితో పాటు దేశ వ్యాప్తంగా అన్ని అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు.. అని పేర్కొన్నారు. (భారత్‌లో 7447 కేసులు.. 239 మరణాలు)
— Aamir Khan (@aamir_khan) April 10, 2020
కాగా కరోనాకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటంలో ఆమిర్ తన వంతు సహాయకంగా పీఎం కేర్స్ ఫండ్‌కి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. అయితే ఎంత మొత్తంలో అందించారనేది మాత్రం ఆయన ప్రకటించలేదు. ప్రస్తుతం ఆమిర్ ‘లాల్ చద్దా’ సినిమా చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిపివేయడంతో.. సినిమా కోసం పనిచేస్తున్న రోజువారీ కార్మికులకు ఆమిర్ సహాయం అందిస్తున్నారు. (మాటపై నిలబడ్డా.. ఇక మీ వంతు: గంభీర్ )
Comments
Please login to add a commentAdd a comment