'లోఫర్' వెరైటీ లుక్! | lofar variety look in latest poster | Sakshi
Sakshi News home page

'లోఫర్' వెరైటీ లుక్!

Published Tue, Dec 1 2015 6:12 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

'లోఫర్' వెరైటీ లుక్! - Sakshi

'లోఫర్' వెరైటీ లుక్!

'కంచె' సినిమాతో హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు మెగా హీరో వరుణ్‌తేజ్‌. తాను నటించిన తొలి రెండు సినిమాలు 'ముకుంద', 'కంచె'లో విభిన్న సబ్జెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్‌తేజ్‌ మూడో ప్రయత్నంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తో జత కట్టాడు. వీరి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'లోఫర్‌'.

 

ఈ సినిమా పేరుకు తగ్గట్టే తాజా పోస్టర్‌లో వెరైటీ లుక్‌తో వరుణ్‌తేజ్ దర్శనమిచ్చాడు. ఈ పోస్టర్‌ను వైష్ణో మీడియా ట్విట్టర్‌లో పోస్టు చేసింది. వినోదం, మదర్ సెంటిమెంట్, హై యాక్షన్ మేళవించిన 'లోఫర్‌' చిత్రంలో కథానాయిక దిశా పటాని. డిసెంబర్ 7న చిత్ర ఆడియో, 18న సినిమాను విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement