
కాశ్మీర్‌లో ప్రేమకథ
కాశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో జరిగే ప్రేమకథా చిత్రంగా ‘రోజ్ గార్డెన్’ తెరకెక్కుతోంది. నితిన్ నాష్, ఫర్జాజ్ శెట్టి జంటగా జి.రవికుమార్(బాంబే రవి) దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఫీల్ ఉన్న ఫ్రెష్ ప్రేమకథా చిత్రమిది. కాశ్మీర్ నేపథ్యంలో సాగుతుంది. రియలిస్టిక్‌గా ఉండేందుకు కాశ్మీర్‌లోనే చిత్రీకరణ జరుపుతున్నాం.
ప్రస్తుతం ఇక్కడ ప్రతికూల పరిస్థితులున్నా నిర్మాత వెనకడుగు వేయకుండా షూటింగ్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు’’ అని చెప్పారు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో కాశ్మీర్‌లో చిత్రీకరణకు ఎవరూ సిద్ధపడరు. కానీ, మేం ముందుకు రావడంతో ఇక్కడి ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు భద్రత కూడా కల్పిస్తామని ప్రకటించింది’’ అని నిర్మాత శ్రీనివాసరావు అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: చదలవాడ తిరుపతిరావు.