వెబ్‌ సిరీస్‌తో క్రేజ్‌ సంపాదించుకున్న శోభిత | Made In Heaven Actor Shobhitha Dhulipala | Sakshi
Sakshi News home page

వెబ్‌ సిరీస్‌తో క్రేజ్‌ సంపాదించుకున్న శోభిత

Published Tue, Mar 26 2019 4:48 PM | Last Updated on Tue, Mar 26 2019 5:12 PM

Made In Heaven Actor Shobhitha Dhulipala  - Sakshi

‘గూఢచారి’తో తెలుగులో క్రేజ్‌ సంపాదించికున్న శోభితా దూళిపాల.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌ ద్వారా తనకంటూ ఇమేజ్‌ సొంతం చేసుకుంటున్నారు. ఆమె నటించిన ‘మేడ్‌ ఇన్‌ హేవెన్‌’ వెబ్‌ సిరీస్‌ విశేషాదరణ పొందింది. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమైన ఈ సిరీస్‌లో తార పాత్రలో నటి శోభితా ధూళిపాల జీవించిందనే చెప్పవచ్చు. ఇందులో ఆమె నటించిన ‘తార’ అనే వెడ్డింగ్‌ ప్లానర్‌ పాత్రకు జనాలు ఫిదా అయిపోయారు.

‘మేడ్‌ ఇన్‌ హేవెన్‌’ సక్సెస్‌ కావడంతో తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంటూ.. ‘విభిన్న కోణాలున్న ‘తార’ పాత్ర నాకు ప్రశంసల్ని అందించింది. నటిగా నేను నా పాత్రకు సంపూర్ణ న్యాయం చేశాననుకుంటున్నా. ‘తార’లాగే నిజ జీవితంలోనూ నేను ఎవరినీ జడ్జ్‌ చేయను. తార పాత్రలోని సున్నితత్వం, చైతన్యం, సంఘర్షణ నటిగా నా ఎదుగుదలకు తోడ్పడుతాయి. ప్రస్తుతం ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎవరూ చేయని విభిన్న పాత్ర చేయాలనుంది’ అని శోభిత తెలిపారు.

తన తదుపరి చిత్రాలపై స్పందిస్తూ.. ‘జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రిషి కపూర్‌, ఇమ్రాన్‌ హష్మీతో కలిసి ‘ద బాడీ’ చిత్రంలో నటించాను. గీతూ మోహన్‌దాస్‌, నివిన్‌ పౌలీతో నటించిన సాహస చిత్రం ‘మూతాన్‌’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. నెట్‌ఫ్లిక్స్‌ నిర్మాణ సంస్థ రూపొందించిన ‘బార్డ్‌ ఆఫ్‌ బ్లడ్‌’ అనే చారిత్రక చిత్రంలో భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement