బర్త్‌డే బాయ్‌ ప్రపంచం | Mahesh babu birthday special | Sakshi
Sakshi News home page

బర్త్‌డే బాయ్‌ ప్రపంచం

Published Thu, Aug 9 2018 12:12 AM | Last Updated on Sun, Apr 7 2019 12:28 PM

 Mahesh babu birthday special - Sakshi

మహేశ్‌బాబు. ఈ పేరు చుట్టూ ఉన్న ప్రపంచం పెద్దది. లక్షల్లో అభిమానులు, నేషనల్‌ వైడ్‌ ఫాలోయింగ్, సూపర్‌స్టార్‌డమ్‌.. ‘రాజకుమారుడు’ నుంచి మొదలుపెడితే నిన్న మొన్న విడుదలైన ‘భరత్‌ అనే నేను’ వరకు ఈ ప్రపంచం అలా పెద్దదవుతూనే ఉంది. ఈ పెద్ద ప్రపంచాన్ని పక్కనపెట్టి చూస్తే, మహేశ్‌బాబుకు ఇంకో చిన్న ప్రపంచం ఉంది. మొన్న ఫ్రెండ్‌షిప్‌ డే రోజు ‘మై ఫ్రెండ్‌. మై వరల్డ్‌’ అని ఆ చిన్న ప్రపంచాన్ని పరిచయం చేశారు మహేశ్‌. ఆ ప్రపంచం పేరు నమ్రతా శిరోద్కర్‌. ఆయన భార్య పేరది.

‘సూపర్‌స్టార్‌ మహేశ్‌’ అనే బ్రాండ్‌ను గత దశాబ్ద కాలంగా తారస్థాయికి తీసుకెళ్లడంలో కీ రోల్‌ పోషించిన పేరు. మహేశ్‌ పర్సనల్‌ లైఫ్‌కు, ప్రొఫెషనల్‌ లైఫ్‌కు మధ్య బ్యాలెన్సింగ్‌ యాక్ట్‌ ఈ పేరు. ఈమధ్యే ‘భరత్‌ అనే నేను’ సినిమా విడుదలై హిట్‌ అయిన సందర్భంలో, ఆ ఆనందాన్ని వెంటనే తన చిన్ని ప్రపంచానికి పంచుతూ, నమ్రతకు ఒక ముద్దిచ్చారు మహేశ్‌. ఆ ఫొటోను ‘థాంక్యూ మై లవ్‌’ అన్న క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు కూడా. అంత స్పెషల్‌ ఆయనకు ఈ ప్రపంచం. ఇవ్వాళ మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనదైన ఓ చిన్న ప్రపంచానికి, అంటే నమ్రతకు కూడా స్పెషల్‌ విషెస్‌ చెబుదాం! 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement