
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార పుట్టిన రోజు వేడుక ఘనంగా జరిగింది. మహేష్, నమ్రతల గారాలపట్టి నేడు( జులై 20) ఆరవ పుట్టినరోజు సందర్భంగా కుటుంబమంతా సరదాగా వేడుక జరుపుకుంది. సితార బర్త్‌డే సందర్భంగా సమ్ థింగ్ స్పెషల్ కేక్‌ను డిజైన్ చేయించారు. తమ ఫ్యామిలీ ఫొటోతో ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్‌తో ఓ స్టార్ హోటల్‌లో బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. మహేష్, నమ్రత, గౌతమ్ కలిసి సితార పుట్టిన రోజును ఘనంగా జరుపగా.. కేక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
అంతేకాకుండా తన కూతురితో దిగిన ఫోటోని ట్విటర్‌లో షేర్ చేసిన మహేష్‌బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా‘ నా ఎవ్రీథింగ్‌కు హ్యాపీ బర్త్‌డే. ఐ లవ్ యూ సితా పాప’ అని మహేష్ కామెంట్ పెట్టారు. సితార బర్త్ డేకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Wishing my everything a very happy 6th ♥♥♥ May you have all that you wish for and more 🤗🤗🤗 I love you Sita papa😘😘😘 pic.twitter.com/VHDpNQSQ7Z
— Mahesh Babu (@urstrulyMahesh) July 19, 2018