ప్రిన్స్ మహేశ్ బాబు, శ్రుతిహాసన్ తొలిసారి జంటగా నటిస్తున్న 'శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఇంతకుముందు 'ఆగడు' సినిమాలో మహేష్ కోసం ఒక ఐటెం సాంగ్ (జంక్షన్లో..) మాత్రం చేసినా.. ఇప్పుడు తొలిసారి ప్రిన్స్ సరసన హీరోయిన్గా చేస్తోంది. సైకిల్ మీద దూసుకొస్తున్న మహేశ్ పోస్టర్ను ఫస్ట్లుక్గా తీసుకొచ్చారు. అయితే.. నిజానికి సూపర్స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 31వ తేదీనే ఫస్ట్ లుక్తో పాటు టీజర్ను కూడా విడుదల చేయాలనుకున్నారు. ఈలోపే ఫస్ట్ లుక్ మాత్రం బయటకు వచ్చింది. దీంతో ఆరోజు టీజర్ను విడుదల చేస్తారని అనుకుంటున్నారు.
ఇక శ్రీమంతుడు సినిమాకు 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో హైదరాబాదీ అమ్మాయి తేజస్వీ మాదివాడ కూడా నటిస్తోంది. ఇప్పటికే ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించింది.
సైకిల్ మీద దూసుకొచ్చిన శ్రీమంతుడు
Published Fri, May 29 2015 3:46 PM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement
Advertisement