
ఇటీవల కాలంలో సినిమాల థియేట్రికల్ రైట్స్‌తో డిజిటల్ రైట్స్ పోటిపడుతున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పెరిగిపోవటంతో వాటి మధ్య పోటి నెలకొంది. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాల డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంటున్నారు. అంతేకాదు సినిమా రిలీజ్ అయిన మూడు వారాల్లోనే డిజిటల్‌లో ప్రదర్శించుకునే ఒప్పందం చేసుకుంటున్న అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో మూవీస్ లాంటి సంస్థలు థియేటర్ల ఆక్యుపెన్సీ మీద ప్రభావం చూపిస్తున్నాయి.
దీంతో నిర్మాతలు డిజిటల్ స్ట్రీమింగ్‌లపై ఆంక్షలు విధించారు. సినిమా విడుదలైన 8 వారాల వరకు డిజిటల్ ప్లాట్‌ఫాంలలో విడుదల చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నిబంధన మజిలీ సినిమా నుంచే ఆచరణలోకి వచ్చింది. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment