మల్లిగాడి పాటల హంగామా
మల్లిగాడి పాటల హంగామా
Published Sat, Nov 30 2013 12:37 AM | Last Updated on Tue, Sep 18 2018 8:13 PM
శ్రీకాంత్, మనోచిత్ర జంటగా ఉదయరాజ్.ఎ దర్శకత్వంలో మల్లెల సీతారామరాజు, పిల్లాడి స్వాతి కలిసి నిర్మించిన చిత్రం ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’. రఘురాం స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. వి.వి.వినాయక్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు అందించారు. వీరితో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, వి.సాగర్, ఎం.ఎల్.కుమార్‌చౌదరి, బెక్కెం వేణుగోపాల్, తరుణ్ అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాంకాంక్షలు అందించారు. చాలాకాలం తర్వాత తాను నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇదని, దర్శకుడు జనరంజకంగా సినిమాను మలిచాడని శ్రీకాంత్ చెప్పారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement