వాస్తవాలను చూడటంలేదు | Manalo Okkadu Audio Launch | Sakshi
Sakshi News home page

వాస్తవాలను చూడటంలేదు

Published Sun, Aug 28 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

వాస్తవాలను చూడటంలేదు

వాస్తవాలను చూడటంలేదు

- ఆర్పీ పట్నాయక్
 సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ‘శీను వాసంతి లక్ష్మి’, ‘బ్రోకర్’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. మరోసారి ఆయన నటిస్తూ, దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించిన చిత్రం ‘మనలో ఒకడు’. ‘నువ్వు నేను’ ఫేం అనిత కథానాయిక. జీసీ జగన్‌మోహన్ నిర్మాత. ఈ చిత్రం పాటల సీడీని ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ విడుదల చేశారు. నటుడు గొల్లపూడి మారుతీ రావు మాట్లాడుతూ-‘‘ కత్తి కంటే కలం పదునైంది అంటారు.
 
  కానీ, ఆ రెండింటి కంటే సినిమా ఇంకా పదునైంది. మీడియాకు సామాజిక స్పృహ అన్నది ఓ బాధ్యత. ఇందులో వ్యాపారం కలిసి ఉండటం వల్ల ఆ బాధ్యత తగ్గుతోంది. దీన్ని కథాంశంగా తీసుకుని ప్రజలకు ఎత్తి చూపడం అభినందనీయం’’ అని పేర్కొన్నారు. ‘‘మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో కోణాన్ని చూపిస్తుంటారు. కానీ, వాస్తవాలను చూడడం లేదు. దీంతో మీడియాలో వచ్చేది న్యూస్ కాదు, వ్యూస్ అని అందరూ అనుకుంటున్నారు’’ అని ఎంపీ కె.కవిత అన్నారు.
 
 ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం మీడియాపై తీసినా చాలా మంది మీడియా మిత్రుల నుంచి అభినందనలు వచ్చాయి. మీడియా రంగంలోని ఈగో ఫ్యాక్టర్‌ను ప్రశ్నించాలని ఈ చిత్రం చేశా. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. నిర్మాతలు జగన్‌మోహన్, ప్రతాని రామకృష్ణ గౌడ్, హీరోయిన్ అనిత, దర్శకుడు చంద్ర సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement