మనలో ఒక్కడు కోసం ఏసుదాస్ | 'Manalo Okkadu' Movie Launch | Sakshi
Sakshi News home page

మనలో ఒక్కడు కోసం ఏసుదాస్

Published Sat, Aug 20 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

మనలో ఒక్కడు కోసం ఏసుదాస్

మనలో ఒక్కడు కోసం ఏసుదాస్

ఆర్పీ పట్నాయక్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మనలో ఒకడు’. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జీసీ జగన్మోహన్ నిర్మించిన ఈ సినిమాలో ‘నువ్వు నేను’ ఫేమ్ అనితా హీరోయిన్. ఆర్పీనే స్వరకర్త. ఈ నెల 27న పాటల్ని విడుదల చేస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ - ‘‘కొంత విరామం తర్వాత గానగంధర్వుడు కేజే ఏసుదాస్ మా సినిమాలో ఓ పాట పాడడం ఆనందంగా ఉంది.

ఆయన పాడిన ‘కలి కలి కలికాలం..’ పాటను వనమాలి రాశారు’’ అన్నారు. ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. కృష్ణమూర్తి అనే సామాన్య లెక్చరర్ పాత్రలో ఆర్పీ నటిస్తున్నారు. ఆర్పీ ‘బ్రోకర్’ని మించేలా ఉంటుందీ సినిమా’’ అని జీసీ జగన్మోహన్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: తిరుమల్ నాగ్, పాటలు: వనమాలి, చైతన్యప్రసాద్, పులగం చిన్నారాయణ, కెమేరా: ఎస్.జె.సిద్ధార్ధ్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాలసుబ్రమణ్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement