
కేంద్రప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపులతో సినీ సెలబ్రిటీలు నెమ్మదిగా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. అయితే మరి కొంతమంది సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమై సోషల్ మీడియా వేదికగా అభిమానులకు చేరువవుతున్నారు. తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రపంచ మాజీ సుందరి మానుషి చిల్లర్ తాజాగా తాను చిన్నతనంలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఓ ఫొటోలో మానుషి తన తల్లితో బర్త్‌డే కేక్‌ను కట్ చేస్తూ కనిపిస్తోంది. ‘యూనిసెఫ్ ఇండియా చైల్డ్‌హుడ్ చాలెంజ్’ లో భాగంగా తన చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు మానుషి పేర్కొన్నారు. (మరోసారి ఫేక్‌న్యూస్ బారిన రకుల్)
‘సురక్షితమైన, సంతోషకరమైన బాల్యాన్ని పొందాను. నేను చాలా అదృష్టవంతురాలిని. ప్రస్తుతం చాలా మంది పిల్లలకు అలాంటి హక్కు లేకుండా పోయింది. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోంది’ అని మానుషి చెప్పారు. యూనిసెఫ్ బలహీనమైన పిల్లలకు అత్యవసర, ప్రాణ రక్షణ సాయాన్ని అందిస్తోందని ఆమె తెలిపారు. యూనిసెఫ్ ఇండియా చైల్డ్‌హుడ్ చాలెంజ్‌కు మద్దతు తెలుపుతూ.. మీరు(పిల్లలు) మీ వయస్సుకు సమానంగా యూనిసెఫ్ ఇండియాకు విరాళం ఇవ్వాలని కోరారు. ఇక ప్రపంచాన్ని పిల్లలందరికీ మెరుగైన ప్రదేశంగా మారుస్తామని, సంక్షోభంలో ఉన్నవారిని రక్షించాలని ప్రతిజ్ఞ చేద్దామని మానుషి పేర్కొన్నారు. మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక మానుషి తన తొలి హిందీ సినిమా ‘పృథ్వీరాజ్’లో హీరో అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. (మరోసారి తెరపైకి కంగనా!)
Comments
Please login to add a commentAdd a comment