మీడియా రిపోర్టులన్ని నాన్సెన్స్!
మీడియా రిపోర్టులన్ని నాన్సెన్స్!
Published Mon, Mar 3 2014 3:16 PM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM
మీడియా అటెన్షన్ ను తనవైపు తిప్పుకోవడంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ముందే ఉంటారు. అలాంటి వర్మకు మీడియాపై కోపం వచ్చింది. అందుకు కారణం తాను వెల్లడించని అంశంపై కథనాలు రావడం ఆయన కోపానికి కారణమైంది. ఇటీవల కాలంలో 12 నెలల్లో 12 సినిమాల్ని విడుదల చేసేందుకు వర్మ సిద్దమవుతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే మీడియాలో వచ్చిన విషయాలను తాను ఎక్కడ, ఎవరికి చెప్పలేదని.. ఎందుకు తప్పుడు వార్తలు రాస్తారో తెలియదంటూ ట్విటర్ లో ఓ సందేశాన్ని వర్మ పోస్ట్ చేశారు.
'12 నెలల్లో 12 సినిమాలు చేస్తున్నానంటూ వచ్చిన రిపోర్టులు కంప్లీట్ నాన్సెన్స్' అన్నారు. అయితే ఏదైనా వార్త వారికి తెలిస్తే తనను సంప్రదించి.. నిజమా, అందులో వాస్తవముందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం జర్నలిస్టులకు లేదా అంటూ మండిపడ్డారు.
Advertisement
Advertisement