
ఆమె నా క్రష్: మెగా హీరో
'తిక్క' సినిమాతో ఫ్యాన్స్ను నిరాశ పరిచాడు సాయి ధరమ్ తేజ్. అయితే 'తిక్క' ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ల్లో బోలెడన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇండస్ట్రీలో మీ క్రష్ ఎవరంటూ అడిగిన ప్రశ్నకు 'సమంత' అంటూ టక్కున సమాధానమిచ్చాడు. సమంత అంటే తేజుకి ఎప్పటినుంచో ఇష్టమట, అవకాశం వస్తే ఆమెతో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు ఈ మెగా హీరో.
కాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న 'నక్షత్రం' సినిమాలో తేజు పోలీసాఫీసర్గా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే షూటింగ్లో బిజీగా ఉన్నాడు సాయి ధరమ్ తేజ్.