'కత్తి' ఎవరి చేతికి వెళుతుందో..? | mega prince varun tej in katthi remake | Sakshi
Sakshi News home page

'కత్తి' ఎవరి చేతికి వెళుతుందో..?

Published Fri, Nov 13 2015 12:33 PM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM

'కత్తి' ఎవరి చేతికి వెళుతుందో..?

'కత్తి' ఎవరి చేతికి వెళుతుందో..?

టాలీవుడ్లో మరే రీమేక్ సినిమా గురించి జరగనంత చర్చ 'కత్తి' సినిమా విషయంలో జరుగుతోంది. కోలీవుడ్లో విజయ్, మురుగదాస్ల కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయంలోమాత్రం క్లారిటీ రావటం లేదు.

కార్పొరేట్ సంస్థల మూలంగా నష్టపోయిన గ్రామ ప్రజలుకు హీరో ఎలా అండగా నిలబడ్డాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి భారీ ప్రయత్నాలు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్స్, ఈ రీమేక్లో నటించే అవకాశం ఉందంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఎన్టీఆర్ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా త్వరలోనే ప్రారంభం అంటూ కూడా వార్తలు వినిపించాయి.

చిరు 150వ సినిమాగా 'కత్తి'ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడని, ఇప్పటికే రైట్స్ కూడా సొంతం చేసుకున్న చరణ్ కథలో తెలుగు నేటివిటికి తగ్గ మార్పులు చేయిస్తున్నాడని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాలను చిరు వర్గం ఖండించకపోవటంతో చిరు రీ ఎంట్రీ కత్తితోనే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఈ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉందట మెగా క్యాంప్. మరి వరుణ్తో అయినా కత్తి రీమేక్ ఉంటుందా..? విజయ్ లాంటి టాప్ స్టార్ చేసిన క్యారెక్టర్కు వరుణ్ ఎంత వరకు న్యాయం చేయగలుగుతాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement