ఎన్నిసార్లు దానం చేసినా తరగని నిధి.. రక్తదానం. ప్రస్తుత కరోనా కాలంలో అందరూ ఇళ్లకే పరిమితమైపోపోవడంతో రక్తదానానికి ఎవరూ ముందుకు రావట్లేదు. మరోవైపు బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం నిలువలు నిండుకోవడంతో రక్తమార్పిడి అవసరమయ్యేవారి పరిస్థితి దుర్భరంగా మారుతోంది. దీంతో అత్యవసర చికిత్స చేస్తున్న సమయంలో ఆసుపత్రుల్లో తగినంత రక్తం అందుబాటులో ఉండట్లేదు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. కానీ, సకాలంలో రక్తం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ముందుకొచ్చి ఆదివారం ఉదయం రక్తదానం చేశారు. (సాహో డైరెక్టర్‌కి ‘మెగా’ ఆఫర్)
దీన్ని తన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు అందించారు. కాగా కొద్ది రోజుల క్రితం నేచురల్ స్టార్ నాని సైతం రక్తదానం చేయగా దాన్ని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుకు ఇచ్చిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ వల్ల రక్తదాన శిబిరాలపై ఆంక్షలు ఉండగా చాలామంది రక్తదానం చేసేందుకు ముందుకు రావట్లేదు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రక్తదాతలు వెంటనే అందుబాటులో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో రక్తదానం చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు కోరారు. (‘కరోనా’ సందేశం.. పవన్, బన్నీ మిస్)
Comments
Please login to add a commentAdd a comment