
సాక్షి, సూర్యపేట : ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ మరణం పట్ల మంత్రి జగదీష్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హాస్యప్రపంచానికి వేణుమాధవ్ మరణం తీరని లోటు అన్నారు. సినీ గగన నీలాకాశంలో హాస్యాన్ని పండించిన నటుడు వేణుమాధవ్ సూర్యపేట జిల్లా బిడ్డ కావడం తమకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించి ఉన్నత స్థానానికి ఎదిగిన గొప్ప వ్యక్తి వేణుమాధవ్ అని కొనియాడారు. కళామతల్లి ఒడిలో ఒరిగిపోయిన వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం వేణుమాధవ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి
వేణుమాధవ్ మరణం పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. వేణుమాధవ్ తో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని మంత్రి దయాకర్ రావు గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment