బాధ్యత గల ప్రేమకథ | more responsibility to love: Hyderabad lovestory | Sakshi
Sakshi News home page

బాధ్యత గల ప్రేమకథ

Published Wed, Dec 18 2013 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

more responsibility to love: Hyderabad lovestory

ప్రేమకు బాధ్యతలెక్కువ... బాధ్యత లేని ప్రేమ ఎప్పటికీ నిలబడదని అని తెలిపే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరీ’. ‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్, రేష్మిమీనన్, జియా ప్రధాన పాత్రధారులు.

రాజ్‌సత్య జి.ఎం దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాత. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ఇందులో రాహుల్ బాధ్యతగల ప్రేమికునిగా నటిస్తున్నారు’’ అని తెలిపారు. వచ్చేనెలలో పాటలను, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement