‘‘1993లో స్థాపించిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఈరోజు మంచి స్థానంలో ఉంది. మా’కి సొంత భవనం, ఓల్డేజ్ హోమ్ కోసం ప్రభుత్వం నుంచి స్థలం ఇప్పిస్తాం. పేద కళాకారులకు మేజర్ ట్రీట్‌మెంట్‌కు సీఏం సహాయనిధి నుంచి డబ్బులు వచ్చేలా చూస్తా. చిత్రపురి కాలనీలో ఇంకొంత మందికి సొంత ఇళ్లు రావాల్సి ఉంది. వాళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాళ్లతో పాటు సినిమా జర్నలిస్టులను కూడా కలుపుకుని ముందుకు వెళ్తే మంచిదని భావిస్తున్నా’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు.
‘మా’ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘విదేశాల్లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాం. అందుకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేశ్‌బాబు, రామ్‌చరణ్ తదితరులు సహకరిస్తామన్నారు’’ అని సోమవారం జరిగిన కర్టన్ రైజర్ ప్రోగ్రామ్‌లో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. 2018 ‘మా’ డైరీని తలసాని ఆవిష్క రించారు. సీనియర్ నటులు కృష్ణ, కృష్ణంరాజు, జమున, శారద తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment