చిత్ర విజయం థియేటర్ల యాజమాన్యం చేతుల్లో..
ఇవాళ చిత్రాల విజయాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి, వారు ఎవరి చేతుల్లో ఉన్నారు అన్న విషయాలకు సీనియర్ నిర్మాత కోవైతంబి కొత్త నిర్వచనం చె ప్పారు. చిత్రాన్ని ఎంత వ్యయప్రయాసాల కోర్చి తీసినా, మనం ఎంత బాగా వచ్చిందని భావించినా దాన్ని భవిష్యత్‌ను తేల్చేది ప్రేక్షకల దేవుళ్లే అని చాలా మం ది అంటుంటారు.అందులో నిజం ఉంది కూడా.అయితే చిత్రం విజయం అనేది ఇప్పడు నటీనటుల చేతుల్లో నో, దర్శకనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోనో లేదని అది ఇప్పుడు థియేటర్ల యాజమాన్యం చేతుల్లో ఉందని కొవైతంబి అన్నారు.అయితే ఆ థియేటర్ల యాజమాన్యం రాజకీయనాయకుల చేతుల్లో ఉన్నారని ఆరోపించారు.
ఈ విధానం మారే వరకూ సినిమాలు థియేటర్లలో పట్టుమని నాలుగు రోజు లు కూడా ఆడే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. నవ నిర్మాత ఏఎస్.ముత్తమిళ్ నిర్మించిన చిత్రం అర్ధనారి. సుందర్ ఇళంగోవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవ నటు డు శ్రీరామ్, నటి అరుంధతి హీరోహీరోయిన్లుగా నటించారు. వి.సెల్లగణేశ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్ర మం శనివారం మధ్యాహ్నం స్థానిక సాలిగారమంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. చిత్ర ఆడియోను పారివేందర్ ఆవిష్కరించగా తొలి ప్రతిని నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్ అందుకున్నారు.