మ్యూజికల్ హిట్ ఖాయం : శ్రీకాంత్ | Musical Hit confirmed: Srikanth | Sakshi
Sakshi News home page

మ్యూజికల్ హిట్ ఖాయం : శ్రీకాంత్

Published Fri, Feb 13 2015 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

మ్యూజికల్ హిట్ ఖాయం : శ్రీకాంత్

మ్యూజికల్ హిట్ ఖాయం : శ్రీకాంత్

 ‘‘ఈ చిత్రానికి చక్రి మంచి పాటలు స్వరపరిచారు. ఆయన లేకపోవడం దురదృష్టం. పాటలన్నీ బాగా కుదిరాయి. ఈ చిత్రం మంచి మ్యూజికల్ హిట్ కావడం ఖాయం’’ అని శ్రీకాంత్ అన్నారు. శ్రీకాంత్, సోనియామాన్ జంటగా రూపొందిన చిత్రం ‘ఢీ అంటే ఢీ’. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శక, నిర్మాత మాట్లాడుతూ - ‘‘చిత్రబృందం అందించిన సహకారం కారణంగా సినిమా బాగా వచ్చింది.

 శ్రీకాంత్, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ఛోటా భీమ్ పాత్రలో పదేళ్ల బాలుడిలా బ్రహ్మానందం నటన బాగా అలరిస్తుంది’’ అని మాటల రచయిత రాజేంద్రకుమార్ తెలిపారు. ఇందులో నాలుగు పాటలు రాశాననీ, విద్యా వ్యవస్థను విశ్లేషిస్తూ రాసిన పాట చాలా బాగుంటుందనీ పాటల రచయిత చంద్రబోస్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement