నా ఇద్దరన్నయ్యలే నాకు ఆదర్శం
ఎన్టీఆర్
‘‘ఈ వేదికపై జానకిరామ్ అన్నయ్య ఉండుంటే బాగుండేది. నేను, కల్యాణ్ రామ్ అన్నయ్య ఒకే వేదికపై మాట్లాడాలనేది ఆయన కల. నాకు నా ఇద్దరన్నయ్యలే ఆదర్శం. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ అంత పెద్ద హిట్ కావాలి ఈ సినిమా’’ అని ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్‌రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ‘పటాస్’ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
థియేటర్ ట్రైలర్‌ను దర్శకులు పూరి జగన్నాథ్, సురేందర్‌రెడ్డి విడుదల చేశారు. పాటల సీడీని ఎన్టీఆర్ ఆవిష్కరించి, రవితేజకు అందించారు. రవితేజ మాట్లాడుతూ -‘‘కల్యాణ్‌రామ్ బంగారం లాంటి వ్యక్తి. ఆయన నిర్మాతగా ‘కిక్-2’ చేస్తున్నా. ‘పటాస్’ పెద్ద హిట్టవ్వాలి’’ అని చెప్పారు. పూరి మాట్లాడుతూ, ‘‘కల్యాణ్ రామ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా పద్ధతైన మనిషి. నాగార్జున కూడా కల్యాణ్‌రామ్ గురించి గొప్పగా చెప్పారు’’ అని తెలిపారు. ఈ వేడుకలో కల్యాణ్‌రామ్, సురేందర్‌రెడ్డి, బి. గోపాల్ అనిల్ రావిపూడి, ‘దిల్’రాజు, వక్కంతం వంశీ, సాయికార్తీక్, శ్రుతీ సోథీ తదితరులు మాట్లాడారు.