janakiram
-
‘సంధ్య’ నిర్వాకాలతో ఎగుమతులకు దెబ్బ
మహారాణిపేట: సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ దిగుమతి చేసుకున్న 25 వేల కిలోల ఇన్ యాక్టివ్ డ్రై ఈస్ట్‌లో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలడం మత్స్య ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్బర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమ రవాణా వల్ల 20 ఏళ్ల క్రితం కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన మత్స్యకారుల త్యాగానికి విలువ లేకుండా పోయిందన్నారు. భూములిచ్చిన 766 మంది మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు ఇస్తామన్న మాటను ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. దేశ అభివృద్ధి కోసం విశాఖ పోర్ట్ యాజమాన్యానికి భూములిస్తే వారు ప్రైవేటు వ్యక్తులకు కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి భూములు అప్పగించారన్నారు. కంటైనర్ టెర్మినల్‌లో ప్రైవేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో అంతర్జాతీయ స్మగ్లర్లు అక్రమ వ్యాపారాలకు విశాఖను ఎంచుకుంటున్నారన్నారు. దీనివల్ల విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినడమే కాకుండా మత్స్య ఎగుమతులపై ప్రభావం చూపుతుందన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు భారత మత్స్య పరిశ్రమకు రాయితీలు, ప్రోత్సాహకాలు రద్దు చేయాలని నిర్ణయించడం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ యాజమాన్యం నిర్వాకాలతో మత్స్య పరిశ్రమ, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంధ్యా ఆక్వా సంస్థతో పాటు విశాఖ కంటైనర్ టెర్మినల్, జేఎం బక్షి సంస్థలను దీనికి బాధ్యులుగా చేసి సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు కంటైనర్ దిగుమతులను విశాఖ పోర్ట్ అథారిటీ స్వయంగా పరిశీలించాలని కోరారు. దిగువ స్థాయి కస్టమ్స్ అధికారులు ప్రమేయం లేకుండా ఇదంతా జరగదని, వీసీటీపీఎల్, జేఎం భక్షి సంస్థలు ఇందుకు బాధ్యత వహించాలన్నారు. విశాఖకు దిగుమతి అవుతున్న ప్రతి కంటైనర్‌ను పూర్తిగా స్కానింగ్ చేసిన తర్వాత దేశంలోకి అనుమతించాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు దూడపోలయ్య, గుంటు దానయ్య, వాసుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు . -
పాలీహౌస్‌ల కోసం రోబోటిక్ స్ప్రేయర్
సాక్షి, అమరావతి: ఎరువులు, పురుగు మందుల పిచికారీకి సాంకేతిక పరిజ్ఞానం జోడించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ అనుబంధ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రోబోటిక్ స్ప్రేయర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని సాయంతో పాలీహౌస్, గ్రీన్ హౌస్‌లలో ద్రవ రూప ఎరువులు, పురుగు మందులను మానవ రహితంగా పిచికారీ చేయొచ్చు. పంటల వారీగా శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే నానో యూరియా, పురుగు మందులను ఈ పరికరం పిచికారీ చేస్తుంది. దీనిద్వారా 20 శాతం యూరియా, పురుగుల మందుల వినియోగం తగ్గడంతోపాటు పెట్టుబడి ఖర్చులు 25 శాతం వరకు ఆదా అవుతాయని క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించారు. దిగుబడుల్లో నాణ్యత పెరగడంతోపాటు పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాల ప్రభావం ఉండదని కూడా తేల్చారు. ప్రత్యేకతలివీ.. ♦ ఈ పరికరం రిమోట్ కంట్రోల్‌తో కిలోమీటర్ మేర పనిచేస్తుంది. ♦ ముందుగా కావాల్సిన రసాయన ఎరువు లేదా పురుగు మందులను తొట్టిలో వేసుకుని మెషిన్ ఆన్ చేసి రిసీవర్, ట్రాన్స్‌మీటర్‌ను కనెక్ట్ చేసుకోవాలి. ♦ రిమోట్ ద్వారా కమాండ్ సిగ్నల్స్‌ను అందిస్తే ఇది పని చేసుకుంటూ పోటుంది. రిమోట్ ద్వారా మెషిన్ దిశను మార్చుకోవచ్చు. ♦ కంట్రోలర్ బటన్ ద్వారా మెషిన్ వేగం, స్ప్రేయర్ పీడనం మార్చుకోవచ్చు. ♦ మొక్క ఎత్తును బట్టి నాజిల్స్ను మాన్యువల్‌గా సర్దుబాటు చేసుకోవచ్చు. ♦ పురుగు మందులను ఏకరీతిన సరైన పరిమాణంతో ఆకుల మీద పడేలా చేయటం దీని ప్రత్యేకత. ♦ తక్కువ మోతాదులో వినియోగించడం వల్ల పురుగు మందుల వృథాతో పాటు భూగర్భ జలాలు కలుషితం కాకుండా అడ్డుకోవచ్చు. ♦ 10–20 లీటర్ల లిక్విడ్ యూరియా, పురుగుల మందులను మోసుకెళ్తూ నిమిషానికి 6 లీటర్లను పిచికారీ చేయగల సామర్థ్యం ఈ పరికరానికి ఉంది. కృత్రిమ మేధస్సుతో.. కృత్రిమ మేధస్సుతో పనిచేసే పరికరాలు, మొబైల్ అప్లికేషన్స్, సెన్సార్లు, డ్రోన్స్, ఆటోమేటిక్ యంత్ర పరికరాలు, వివిధ సాఫ్ట్వేర్స్ రూపకల్పన కోసం ఆదికవి నన్నయ, జేఎన్టీయూకే, ఎన్ఐటీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులో భాగంగా ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రోటోటైప్ రోబోటిక్ స్ప్రేయర్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో మార్పుచేసి మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా మొక్కల వ్యాధులు, తెగుళ్లను గుర్తించడంపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. – డాక్టర్ తోలేటి జానకిరామ్, వీసీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
జీఎస్టీ టీజర్ బాగుంది
‘‘నా శిష్యుడు జానకిరామ్ తొలిసారి దర్శకత్వం చేస్తున్న చిత్రం ‘జీఎస్టీ’(దేవుడు సైతాన్ టెక్నాలజీ). ఈ సినిమా టీజర్ చాలా బాగుంది.. సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను’’ అని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఆనంద్ కృష్ణ, అశోక్, స్వాతి మండల్, యాంకర్ ఇందు, పూజ సుహాసిని ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘జీఎస్టీ’(దేవుడు సైతాన్ టెక్నాలజీ). కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని పోసాని కృష్ణమురళి విడుదల చేశారు. జానకిరామ్ మాట్లాడుతూ–‘‘సమాజంలో ఎంతో మందికి దేవుడు, దెయ్యం, సైన్స్ పైన ఎన్నో ప్రశ్నలున్నాయి. ఇలాంటి ప్రశ్నలే ఇటీవల కరోనా టైంలో కూడా వచ్చాయి. లాక్ డౌన్లో భాగంగా అన్ని మాతాల ప్రార్థనాలయాలు మూత పడ్డాయి. ఈ సమయంలో కరోనా అనే సైతాన్ గెలిచిందా? దేవుళ్లు ఓడిపోయారా? ఆ ప్రశ్నల్ని కథగా మలిచి సినిమా తెరకెక్కించా’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం: యు.వి.నిరంజన్. -
మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణం
నల్లగొండ : ‘మితిమీరిన వేగం ప్రమాదాలకు ప్రధాన కారణం. కారు నడిపే వ్యక్తితో పాటు కారులో ఉన్న అందరూ ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకోవాలి. అదే ప్రాణానికి రక్షణ కవచం లాంటిది’ అంటున్నారు నల్ల గొండ ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డి. రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు హరికృష్ణ మృతిచెందిన నేపథ్యంలో ఆయన బుధవారం పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. ‘ఇంటర్నేషనల్ సెప్టీ టెస్టింగ్’ సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం ఏ కారైన 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తేనే మంచిది. ఆ సమయంలో ప్రమాదం జరిగినా కారులో రక్షణ కోసం ఉన్న ఎయిర్ బ్యాగ్స్ పనిచేస్తాయి. ప్రమాదం నుంచి బయటపడవచ్చు. అంతకంటే వేగం మించితే వారు వెళ్లే వేగాన్ని బట్టి ఎంత రక్షణ ఉంటుదనేది చెప్పలేని పరిస్థితి. ప్రధానంగా ప్రమాదం అనేది మానవ తప్పిదంగానే ఎక్కువ శాతం ఉంటుంది. ప్రస్తుతం అత్యంత సాంకేతికతతో కూడిన వాహనాలు తయారవుతున్నాయి. కారును స్టార్ట్ చేయడానికి కీ పెట్టగానే అన్ని లైట్లు వస్తాయి. ఆన్ చేయగానే ఆ లైట్లన్ని పోతాయి. ఒక వేళ లైట్లు కొన్ని వెలుగుతున్నాయంటే అందులో ఏదో ఒక ప్రాబ్లం ఉందని వాహనచోదకుడు తెలుసుకోవాల్సిందే. కానీ చాలా మంది పట్టించుకోకుండా అలానే నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. బెల్ట్ పెట్టుకోకుంటే శబ్ధం వస్తుంది. అది కొంతదూరం వెళ్లే వరకే వస్తుంది. కానీ చాలా మంది సీటు బెల్టు పెట్టుకోవడం లేదు. ఇంజన్అయిల్ మార్చుకోవాల్సిన సమయం వచ్చినా, టైర్లో గాలి తక్కువగా ఉన్నా సిగ్నల్స్ వస్తాయి. పట్టించుకోవడం లేదు. టైర్ల కంపెనీలు లక్ష కిలోమీటర్ల వరకు మన్నిక ఉంటాయని చెప్పుతున్నాయి. కానీ నడిపే వ్యక్తికి బ్రేక్ వేసిన సందర్భంలో టైర్ జారీపోతున్నట్లుగా ఉంటే దానిని వెంటనే మార్చుకోవాల్సిందే. సెల్ప్ఫోన్ మాట్లాడుతూ కారు నడపడం మంచిది కాదు. చోదకుడు ఎప్పుడూ వాహనం ఎంత వేగంలో ఉందో చూసుకుంటూ, ప్రయాణం మీదనే దృష్టి సారిం చాలి. ఏదైనా అవసరమైతే ఆగాలి. తప్ప కారు నడుపుతూ ఫోన్ మాట్లాడటం, వాటర్ తాగడం లాంటి పనులు చేయడం మంచిది కాదు. ఎన్ని కోట్ల రూపాయల వాహనమైనా నిబంధనల ప్రకారం నడిపితేనే రక్షణ. లేదంటే ప్రమాదాలను కొని తెచ్చుకున్నవాళ్లమే అవుతాము. సీటు బెల్ట్‌తో ప్రాణానికి రక్షణ నల్లగొండ క్రైం : సీటు బెల్ట్‌తో ప్రాణానికి లింక్ ఉంది. కారులో సీటు బెల్ట్ ధరించి వాహనాన్ని నడిపే వారంతా సురక్షితంగా గమ్యానికి చేరుకుంటున్నారు. ఎంతటి ప్రమాదం జరిగినా సీటు బెల్ట్ ఉంటే ప్రాణాపాయం నుంచి బయటపడతారని నల్లగొండ టూటౌన్ సీఐ భాష తెలిపారు. హరికృష్ణ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని స్పష్టం చేశారు. సీటుబెల్ట్ ధరిస్తే ఎంతటి రోడ్డు ప్రమాదమైన ప్రాణాలు సురక్షితం. వాహన మోడల్‌ను బట్టి కొన్ని కిలోమీటర్ల వేగం వరకే హెయిర్ బెల్లూన్స్ ఓపెన్ అవుతాయి. సీటుబెల్ట్ పెట్టుకుంటేనే బెల్లూన్స్ ఓపెన్ అవుతాయి. సీటు బెల్ట్ వల్ల గుండె, ఊపిరితిత్తులు, చాతి ఎముకలకు, తలకు గాయాలు కావు. స్టీరింగ్ తగలకపోగా, కుడి, ఎడమ వైపు కూడా గాయాలు కావు. బలంగా ఇసుకలారీ వేగంగా గుద్దితే సీటు బెల్ట్ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు. గత అనేక సంఘటనల్లో 95 శాతం సీటు బెల్ట్ పెట్టుకున్న వారు ప్రమాదాల నుంచి బయటపడ్డారు. వాహనం నడిపేటప్పుడు బెల్ట్ పెట్టుకోకపోతే చిన్న ప్రమాదమైనా తల, స్టీరింగ్‌కు తగిలి మృతి చెందుతారు. వాహనం నడిపేటప్పుడు ప్రతిఒక్కరూ సీటు బెల్ట్ పెట్టుకునేలా అలవాటు చేసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు ముందుచూపు, పరిమిత వేగం మాత్రమే ఉండాలి. ఇక్కడి రహదారులలో 80 నుంచి 90 కిలోమీటర్ల లోపు వేగమే సురక్షితం. -
నా ఇద్దరన్నయ్యలే నాకు ఆదర్శం
ఎన్టీఆర్ ‘‘ఈ వేదికపై జానకిరామ్ అన్నయ్య ఉండుంటే బాగుండేది. నేను, కల్యాణ్ రామ్ అన్నయ్య ఒకే వేదికపై మాట్లాడాలనేది ఆయన కల. నాకు నా ఇద్దరన్నయ్యలే ఆదర్శం. ‘రౌడీ ఇన్స్పెక్టర్’ అంత పెద్ద హిట్ కావాలి ఈ సినిమా’’ అని ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్‌రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ‘పటాస్’ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. థియేటర్ ట్రైలర్‌ను దర్శకులు పూరి జగన్నాథ్, సురేందర్‌రెడ్డి విడుదల చేశారు. పాటల సీడీని ఎన్టీఆర్ ఆవిష్కరించి, రవితేజకు అందించారు. రవితేజ మాట్లాడుతూ -‘‘కల్యాణ్‌రామ్ బంగారం లాంటి వ్యక్తి. ఆయన నిర్మాతగా ‘కిక్-2’ చేస్తున్నా. ‘పటాస్’ పెద్ద హిట్టవ్వాలి’’ అని చెప్పారు. పూరి మాట్లాడుతూ, ‘‘కల్యాణ్ రామ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా పద్ధతైన మనిషి. నాగార్జున కూడా కల్యాణ్‌రామ్ గురించి గొప్పగా చెప్పారు’’ అని తెలిపారు. ఈ వేడుకలో కల్యాణ్‌రామ్, సురేందర్‌రెడ్డి, బి. గోపాల్ అనిల్ రావిపూడి, ‘దిల్’రాజు, వక్కంతం వంశీ, సాయికార్తీక్, శ్రుతీ సోథీ తదితరులు మాట్లాడారు. -
కృష్ణానదిలో జానకిరామ్ అస్థికల నిమజ్జనం
ఇటిక్యాల: నల్లగొండ జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ అస్థికలను బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. పుష్కరఘాట్‌పై పూజారుల మంత్రోచ్ఛరణల మధ్య జానకిరామ్ కుమారుడు మాస్టర్ తారక రామారావు, సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, బాలకృష్ణ సోదరుడు రామకృష్ణలతో కలసి అస్థికలను కృష్ణాన దిలో కలిపారు. -
ఎన్టీఆర్ టెంపర్ షూటింగ్ వాయిదా
చెన్నై: సోదరుడు నందమూరి జానకిరామ్ అకస్మిక మరణం జూనియర్ ఎన్టీఆర్‌ను తీవ్రంగా కలచివేసింది. దీంతో ఆయన శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న టెంపర్ చిత్ర షూటింగ్‌ను 10 రోజుల పాటు వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు మంగళవారం చెన్నైలో వెల్లడించాయి. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో పవర్‌పుల్ పోలీసు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఒదిగిపొయి నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, మధురిమా బెనర్జీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 2015 సంక్రాంతికి టెంపర్ చిత్రం విడుదల చేయాలని ఆ చిత్ర యూనిట్ షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. -
జానకిరామ్ సంతాప సభ
-
దేవుడు నన్ను మోసం చేశాడూ...
హైదరాబాద్ : పెద్ద కుమారుడు జానకిరామ్ మరణవార్త వినగానే ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ 'దేవుడు నన్ను మోసం చేశాడంటూ' విలపిస్తూ కుప్పకూలి పోయారు. తన కుటుంబానికే ఇలా ఎందుకు జరగుతుందంటూ తీవ్ర ఆవేదన చెందారు. హరికృష్ణను ఓదార్చడం అక్కడే ఉన్న కుటుంబసభ్యులు, బంధువుల తరం కాలేదు. కుటుంబ సభ్యులతోపాటు జానకిరామ్ భార్య, పిల్లల తీవ్ర దుఖఃసాగరంలో మునిగిపోయారు. జానకిరామ్ మరణవార్త విన్న వెంటనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. నందమూరి కుటుంబసభ్యులు, బంధువులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, బాబు కేబినెట్ లోని మంత్రులు హరికృష్ణ నివాసానికి చేరుకుంటున్నారు. పెద్ద కుమారుడు జానకిరామ్ మృతితో హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని నందమూరి హరికృష్ణ ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి.