
ఉచితంగా నటిస్తా!
నడిగర్ సంఘం నిర్మించే చిత్రంలో ఉచితంగా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని నటుడు సూర్య తెలిపారు.
నడిగర్ సంఘం నిర్మించే చిత్రంలో ఉచితంగా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని నటుడు సూర్య తెలిపారు. సూర్య మూడు పాత్రలలో నటించిన ‘24’ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. సమంత తదితరులు నటించిన ఈ చిత్రానికి విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి సూర్య మాట్లాడుతూ మనసుకు నచ్చిన మంచి చిత్రాలలో నటించాలన్నదే తన ఆశయమని, కమల్ 30 ఏళ్ల ప్రాయంలో నటించిన తరహా కథలు ప్రస్తుతం తనను వెదుక్కుంటూ వస్తున్నాయన్నారు. ‘24’ సైంటిఫిక్ కథ అని, హీరో, విలన్‌తో సహా మూడు పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు.
ఈ చిత్రంలో విలన్ పేరు ఆత్రేయ అని, చిత్రానికి ఈ పాత్ర వెన్నెముక వంటిదన్నారు. మేధావి విలన్‌గా ఈ ప్రాత్ర రూపొందిందన్నారు. ప్రస్తుతం తన చిత్రాలు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ డబ్ చేయబడుతున్నాయని, మలయాళంలో డెరైక్ట్‌గా రిలీజవుతున్నట్లు తెలిపారు. అందుచేత మూడు భాషల ప్రేక్షకులను సంతృప్తిపరచాల్సి ఉందన్నారు. సామాజిక బాధ్యతా కథా చిత్రాల్లో నటించాల్సి వస్తోందని, కొన్నేళ్లుగా తాను పొగతాగే సీన్లలో నటించడం లేదని, వీలైనంత వరకు మద్యం తాగే సీన్లను నిరాకరిస్తున్నట్లు తెలిపారు.
పేద సినీ కళాకారుల సంక్షేమం కోసం కొత్త భవనాన్ని నిర్మించి, దాని ద్వా రా నెలసరి రూ.50 లక్షలు ఆదాయం గడించేందుకు నడిగర్ సంఘం నిర్ణయిం చిందని, ఇందుకోసమే నడిగర్ సంఘం నిర్వహించిన క్రికెట్ పోటీలో తాను పా ల్గొన్నట్లు తెలిపారు. అవసరమైతే నడిగర్ సంఘం అభివృద్ధి కోసం విశాల్, కార్తీ ఉచితంగా నటించే చిత్రంలో తానూ ఉచితంగా నటిస్తానన్నారు. తన కుటుంబం అగరం ఫౌండేషన్ ద్వారా అనేక సహాయాలు అందిస్తున్నామని, ఇంతవరకు 1,300 మంది విద్యార్థులకు పైగా విద్యా సహాయకాలు అందజేశామన్నారు. జలవనరుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ అవగాహనకు సాయపడుతున్నామని తెలిపారు.