నాగ్‌కు శివలాగా... చైతూకి దుర్గ
నాగ్‌కు శివలాగా... చైతూకి దుర్గ
Published Thu, Feb 6 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
నాగచైతన్య, హన్సిక జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ‘దుర్గ’ చిత్రం ప్రారంభమైంది. సి. కల్యాణ్ సమర్పణలో వరుణ్, శ్వేతలాన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి రఘురామకృష్ణరాజు కెమెరా స్విచాన్ చేయగా, డి.రామానాయుడు క్లాప్ ఇచ్చారు. వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ -‘‘దూకుడు, ఢీ, రెడీ చిత్రాల తరహాలో పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా ఇది.
బహ్మానందం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది’’ అని చెప్పారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ -‘‘నాగార్జునకు ‘శివ’లాగా నాగచైతన్యకు ‘దుర్గ’ అలా నిలిచిపోతుంది. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, జూలైకి పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ-మాటలు: ఆకుల శివ, సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: విజయ్.సి.కుమార్.
Advertisement
Advertisement