
వేడుక వాయిదా వేసిన నాగ్
ప్రేమమ్ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన నాగచైతన్య తరువాత వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. వరుస విజయాల ఫాంలను కంటిన్యూ చేసేందుకు నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను పూర్తి చేశాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మే 19న రిలీజ్ చేయాలని భావించారు.
అవుట్ పుట్ విషయంలో అంత సంతృప్తిగా లేని నాగ్, సినిమాకు కరెక్షన్లు చేయాలని సూచించాడట. దీంతో అనుకున్న సమయానికి సినిమా రెడీ కాకపోవటంతో వాయిదా వేసేందుకు డిసైడ్ అయ్యారు. హడావిడి రిలీజ్ చేసేకన్నా అన్ని కరెక్ట్గా చూసుకొని కాస్త ఆలస్యంగా రిలీజ్ చేసిన పర్లేదన్న ఆలోచనలో ఉన్నాడు నాగ్. అందుకే అవుట్ పర్ఫెక్ట్ అనుకున్న తరువాత తీరిగ్గా జూన్ 8న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.