వీళ్లు చాలా క్లోజ్.. కానీ... | Naga Shaurya's Abbai Tho Ammai | Sakshi
Sakshi News home page

వీళ్లు చాలా క్లోజ్.. కానీ...

Published Wed, Dec 9 2015 12:57 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

వీళ్లు చాలా క్లోజ్.. కానీ... - Sakshi

వీళ్లు చాలా క్లోజ్.. కానీ...

ఆ  అబ్బాయికి  ఫోన్‌లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఒకరి జీవితాన్ని ఒకరు మాటల్లో ఆవిష్కరించుకున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్‌ల్లో మునిగిపోయి ప్రపంచాన్ని మర్చిపోయారు. అంత బాగా క్లోజ్  అయిపోయారు.  కానీ ఇద్దరూ ఎప్పటికీ అన్‌నోన్ ఫ్రెండ్స్‌గా మిగిలిపోవాల నుకుంటారు. కానీ సడన్‌గా ఆ అమ్మాయి దీన్ని బ్రేక్ చేయాలనుకుంటుంది. అసలు ఎందుకో, ఏమిటో తెలియాలంటే ‘అబ్బాయితో అమ్మాయి’ చూడాలంటు న్నారు హీరో నాగశౌర్య.  

రమేశ్ వర్మ దర్శకత్వంలో నాగశౌర్య, పలక్ లల్వానీ జంటగా వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోతిని నిర్మించిన  చిత్రం ‘అబ్బాయితో... అమ్మాయి’. ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగశౌర్య మాట్లాడుతూ-‘‘ఇది నా హోమ్ బ్యానర్ లాంటిది. ఎక్కడా లెక్కలు వేసుకోకుండా నా గురించి ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. రమేశ్‌వర్మ గారు మూడున్నర ఏళ్లు పాటు నా కోసం వెయిట్ చేశారు.

ఇళయరాజాగారి 999వ సినిమా నాది కావడం చాలా ఆనందంగా ఉంది. కుదిరితే ఆయనతో మరో సినిమా కూడా చేయాలని ఉంది’’ అని అన్నారు.  రమేశ్‌వర్మ మాట్లాడుతూ- ‘‘‘వీర’ సినిమా తర్వాత ఓ ఫ్రెష్ పెయిర్‌తో లవ్ స్టోరీ తీద్దామనుకున్నా. అప్పుడే నాగశౌర్య హీరోగా ఓ కథ తయారు చేసుకున్నా  కానీ నాగ శౌర్య బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అనుకున్న దాని క న్నా సినిమాకు చాలా బడ్జెట్ అయింది. కానీ నిర్మాతలు మాత్రం ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’’ అని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సినిమా చూసిన వాళ్లందరూ బాగుందటున్నారు. మంచి బిజినెస్ కూడా జరిగింది. ఇళయరాజా గారి సూచన మేరకు ఈ చిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో నాగశౌర్యతో మరో చిత్రం చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురళీకృష్ణ కొడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement