Abbai Tho Ammai
-
వీళ్లు చాలా క్లోజ్.. కానీ...
ఆ అబ్బాయికి ఫోన్లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఒకరి జీవితాన్ని ఒకరు మాటల్లో ఆవిష్కరించుకున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్‌ల్లో మునిగిపోయి ప్రపంచాన్ని మర్చిపోయారు. అంత బాగా క్లోజ్ అయిపోయారు. కానీ ఇద్దరూ ఎప్పటికీ అన్నోన్ ఫ్రెండ్స్‌గా మిగిలిపోవాల నుకుంటారు. కానీ సడన్‌గా ఆ అమ్మాయి దీన్ని బ్రేక్ చేయాలనుకుంటుంది. అసలు ఎందుకో, ఏమిటో తెలియాలంటే ‘అబ్బాయితో అమ్మాయి’ చూడాలంటు న్నారు హీరో నాగశౌర్య. రమేశ్ వర్మ దర్శకత్వంలో నాగశౌర్య, పలక్ లల్వానీ జంటగా వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోతిని నిర్మించిన చిత్రం ‘అబ్బాయితో... అమ్మాయి’. ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగశౌర్య మాట్లాడుతూ-‘‘ఇది నా హోమ్ బ్యానర్ లాంటిది. ఎక్కడా లెక్కలు వేసుకోకుండా నా గురించి ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. రమేశ్‌వర్మ గారు మూడున్నర ఏళ్లు పాటు నా కోసం వెయిట్ చేశారు. ఇళయరాజాగారి 999వ సినిమా నాది కావడం చాలా ఆనందంగా ఉంది. కుదిరితే ఆయనతో మరో సినిమా కూడా చేయాలని ఉంది’’ అని అన్నారు. రమేశ్‌వర్మ మాట్లాడుతూ- ‘‘‘వీర’ సినిమా తర్వాత ఓ ఫ్రెష్ పెయిర్‌తో లవ్ స్టోరీ తీద్దామనుకున్నా. అప్పుడే నాగశౌర్య హీరోగా ఓ కథ తయారు చేసుకున్నా కానీ నాగ శౌర్య బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అనుకున్న దాని క న్నా సినిమాకు చాలా బడ్జెట్ అయింది. కానీ నిర్మాతలు మాత్రం ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సినిమా చూసిన వాళ్లందరూ బాగుందటున్నారు. మంచి బిజినెస్ కూడా జరిగింది. ఇళయరాజా గారి సూచన మేరకు ఈ చిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో నాగశౌర్యతో మరో చిత్రం చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురళీకృష్ణ కొడాలి. -
పొయిటిక్ లవ్
సోషల్ వరల్డ్‌లో ఓపెన్‌గా తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్న యువతరం రియల్ వరల్డ్‌లోకి వచ్చేసరికి అంత ఓపెన్‌గా ఉండటంలేదు. ఈ రెండు ప్రపంచాల మధ్య కన్ఫ్యూజన్గా సాగే యువతరం జీవితాన్ని, ప్రస్తుతం ట్రెండ్‌ని ఆవిష్కరిస్తూ రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’. నాగ శౌర్య, పల్లక్ లల్వానీ జంటగా వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సంగీత జ్ఞాని ఇళయారాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 7న విడుదల చేయనున్నారు. ఈలోపు నేటి నుంచి శుక్రవారం వరకూ విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, వరంగల్‌లో ఒక్కో పాటను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. రమేశ్ వర్మ చాలా ట్రెండీగా, పొయిటిక్గా తెరకెక్కించారు. ఇళయరాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. యూత్, ఫ్యామిలీస్ అందరూ చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యాం కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురళీకృష్ణ కొడాలి.