కొంత బ్రేక్ తర్వాత! | Nagarjuna Back On Action | Sakshi
Sakshi News home page

కొంత బ్రేక్ తర్వాత!

Published Tue, Jun 21 2016 10:45 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

కొంత బ్రేక్ తర్వాత! - Sakshi

కొంత బ్రేక్ తర్వాత!

సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి హిట్‌తో ప్రేక్షకులను అలరించిన నాగార్జున ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా భక్తి రసాత్మక చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందనున్న ‘నమో వెంకటేశా’లో వెంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్ బాబాగా నటించనున్నారాయన. ఈ పాత్ర కోసం నాగ్ గడ్డం పెంచుతున్నారు.
 
  త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. ఈలోపు నాగ్ ఓ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అదే ‘నిర్మలా కాన్వెంట్’. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
 ఇందులో నాగార్జున ఒక ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. మంగళవారం ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. ‘‘కొంత బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నా. చాలా ఎంజాయ్ చేస్తున్నా’’ అని నాగ్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement