ఇక రిటైర్ అయినా ఫరవాలేదు! | Nana Patekar gears up for 'Nat Samrat' dream project | Sakshi
Sakshi News home page

ఇక రిటైర్ అయినా ఫరవాలేదు!

Published Fri, Mar 6 2015 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

ఇక రిటైర్ అయినా ఫరవాలేదు!

ఇక రిటైర్ అయినా ఫరవాలేదు!

మరో మూడేళ్లలో నానా పటేకర్ కెరీర్‌కు నలభై వసంతాలు నిండుతాయి. ఈ నేపథ్యంలో నాలుగు దశాబ్దాల క్రితం విడుదలైన మరాఠీ చిత్రం ‘నట్ సమ్రాట్’ని పునర్నిర్మించి, అందులో నటించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. పదిహేనేళ్ల వయసులో చూసిన ఆ మరాఠీ చిత్రం అలా మనసులో నిలిచిపోయిందని నానా పటేకర్ చెబుతూ - ‘‘ఇప్పటివరకు నేనెన్నో మరాఠీ చిత్రాల్లో నటించాను. కానీ, అన్నింటికన్నా ఇది ‘బెస్ట్’ మూవీ. అతిశయోక్తి అనుకోకుంటే ఓ మాట చెబుతా.

ఇందులో నటించాక నేనిక రిటైరైనా ఫరవాలేదు. ఎందుకంటే, ఈ చిత్రం నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చేస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి మహేశ్ మంజ్రేకర్ దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement