కొంచెం క్లాస్... కొంచెం మాస్! | Nannaku Prematho Jr NTR First Look | Sakshi
Sakshi News home page

కొంచెం క్లాస్... కొంచెం మాస్!

Published Sat, Aug 15 2015 10:48 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

కొంచెం క్లాస్... కొంచెం మాస్!

కొంచెం క్లాస్... కొంచెం మాస్!

మాస్‌గా కనిపించే క్లాస్ లుక్ ఎలా ఉంటుంది? అచ్చం ఇక్కడ మీరు చూస్తున్న స్టిల్‌లాగే ఉంటుంది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రంలోనిదీ స్టిల్. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఎన్టీఆర్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. లుక్ పరంగానే కాదు. ఆయన పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌లు ఈ చిత్రంలో కీలక పాత్రధారులు’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘సెప్టెంబర్ 20 వరకు లండన్‌లో షూటింగ్ చేస్తున్నాం.

ఆ తర్వాత 20 రోజుల పాటు స్పెయిన్‌లో చేసే షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుంది’’ అని నిర్మాత అన్నారు. ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి అధికారికంగా పేరింకా ఖరారు కాలేదు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: విజయ్ కె. చక్రవర్తి, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement