హృతిక్ రోషన్ కు ప్రధాని మోడీ ప్రశంస! | Narendra Modi lauds Hrithik Roshan for joining Clean India drive of Swachh Bharat | Sakshi
Sakshi News home page

హృతిక్ రోషన్ కు ప్రధాని మోడీ ప్రశంస!

Published Sun, Oct 26 2014 5:25 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

హృతిక్ రోషన్ కు  ప్రధాని మోడీ ప్రశంస! - Sakshi

హృతిక్ రోషన్ కు ప్రధాని మోడీ ప్రశంస!

న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకున్న బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఎంతోమందికి స్పూర్తిని కలిగించారని మోడీ తెలిపారు. హృతిక్ నుంచి మీరందరూ స్పూర్తిని పొందుతారనే విశ్వాసాన్ని మోడీ వ్యక్తం చేశారు. పరిశుభ్రతపై మహాత్మా గాంధీ జన్మదినం అక్టోబర్ 2 తేదిన మోడీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. 
 
ముంబైలోని జుహూలో తన నివాస సమీపంలోని వీధుల్లో క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టాం. స్వచ్ఛ భారత్ లో పాల్గొనడం ద్వారా ఎంతో నేర్చుకున్నాను అని హృతిక్ ట్వీట్ చేశారు. నా దేశాన్ని, నగరాన్ని, విధులను, నివాసంలో పాటించాలని ఓ నిర్ణయం తీసుకున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా మరికొంతమందిని చైతన్య పరుస్తానని హృతిక్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement