అందుకే అది ఆడడం మానేశా! | Nature lover role in Pandaga Chesko movie says Rakul Preet Singh | Sakshi
Sakshi News home page

అందుకే అది ఆడడం మానేశా!

Published Tue, May 19 2015 12:58 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

అందుకే అది ఆడడం మానేశా! - Sakshi

అందుకే అది ఆడడం మానేశా!

 ‘‘కెమెరా ముందుకెళ్లాక నేను  రకుల్ అనే విషయాన్ని స్విచాఫ్ చేసేసి, చేస్తున్న పాత్రను స్విచాన్ చేస్తాను’’ అని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. రామ్ సరసన ఆమె నటించిన ‘పండగ చేస్కో’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి రకుల్ చెబుతూ -‘‘ఇందులో నేను ప్రకృతి ప్రేమికురాలిని. పేరు దివ్య. సినిమాలో తను చేసే పనులన్నీ చూసేవాళ్లకి కామెడీగా అనిపిస్తాయి. రామ్ ఫుల్ ఎనర్జిటిక్. అతనితో డాన్స్ చేయడం కొంచెం కష్టమనిపించింది. అయినప్పటికీ సవాలుగా తీసుకుని చేశాను. ఇప్పట్నుంచీ మరో రెండు నెలల వరకూ పండగలు లేవు.
 
  కానీ, ఈ సినిమా ఓ పండగ లాంటిదే. నాకు అన్ని పండగలూ ఇష్టమే. ముఖ్యంగా హోలీ పండగంటే ఇష్టం. రంగుల పొడి వల్ల చర్మం, జుట్టు పాడవుతాయని హోలీ ఆడడం మానేశాను’’ అన్నారు. గ్లామర్ అంటే చాలామంది నెగటివ్‌గా అనుకుంటున్నారని చెబుతూ -‘‘గ్లామర్ అంటే అందంగా కనిపించడం... అభ్యంతరకరంగా కనిపించడం కాదు. కథ డిమాండ్ చేస్తే, నేను గ్లామరస్‌గా కనిపించడానికి వెనకాడను. పాత్రకు న్యాయం చేయడానికి కృషి చేస్తాను కాబట్టే, ఈ స్థాయికి రాగలిగాను. ఇప్పుడందరూ ‘నువ్వు టాప్ ఫైవ్ హీరోయిన్స్‌లో ఉన్నావ్’ అంటుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement